Telugu News

రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం భేటీ

సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న మంత్రి అజయ్ కుమార్

0

★ రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం భేటీ

★ సహచర మంత్రులతో కలిసి పాల్గొన్న మంత్రి అజయ్ కుమార్

(ఖమ్మం ప్రతినిధి-విజయం న్యూస్);-

ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణ, ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంగ్లీష్ మీడియం బోధనకు చేపట్టవలసిన విధివిధానాలను రూపొందించేందుకు సీఎం కేసిఆర్ ఆదేశాలతో బుధవారం హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని డాక్టర్‌ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం సమావేశమైంది.

also read :-మంత్రి హత్యకు కుట్రలో కొత్త ట్విస్ట్..

వచ్చే ఏడాది నుంచి 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు విద్యార్థులకు తొలుత ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తీసుకురావాలని మంత్రివర్గ ఉప సంఘం ఖరారు చేసింది. తొలుత తెలుగు మీడియం చదివే విద్యార్థుల‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేలా ప్రతి పుస్తకంలో ఆంగ్లంలోని పాఠంతో పాటు సమాంతరంగా తెలుగులోనూ పాఠాన్ని అందించాల‌ని నిర్ణయం తీసుకున్నారు.

రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు శ్రీ కేటీఆర్, శ్రీ హరీష్ రావు, శ్రీ పువ్వాడ అజయ్ కుమార్, శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీ గంగుల కమలాకర్, శ్రీమతి సత్యవతి రాథోడ్, శ్రీ వేముల ప్రశాంత్ రెడ్డి, శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు, శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు.