Telugu News

మేమున్నాం అంటూ అండగా నిలిచిన సీఐ బ్యాచ్ మెంట్స్.

స్నేహితునికుటుంబాన్ని అదుకున్న 2009 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్

0

మేమున్నాం అంటూ అండగా నిలిచిన సీఐ బ్యాచ్ మెంట్స్
== స్నేహితునికుటుంబాన్ని అదుకున్న 2009 సర్కిల్ ఇన్స్పెక్టర్స్ బ్యాచ్
== రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సీఐ కుటుంబానికి రూ. 29 లక్షలు అందజేసిన సీఐలు
== భవిష్యత్ తరాలకు ఆదర్శంగా నిలిచిన పోలీస్ అధికారులు
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్);-
స్నేహమేరా జీవితం.. స్నేహమేరా శాశ్వతం.. స్నేహమేరా అంకితం అని ఓ సినికవి రాసిన పాటను అక్షరాల నిజం చేస్తున్నరు మన పోలీస్ అధికారులు.. ఉద్యోగిగా కలిసిన మిత్రులందరు ఏకతాటిపై ఉండి ఎవరికేమైనప్పటికి వారి కుటుంబాన్ని అదుకునే విషయంలో ముందుంటున్న ఈ బ్యాచ్ మెంట్స్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.. ఒక్కటి కాదు.. రెండు కాదు.. సుమారు రూ.30లక్షలను అర్థిక చేయూతనందిస్తూ తన స్నేహితుడు లేకపోయినప్పటికి మేమున్నామంటూ కుటుంబానికి అండగా నిలబడిన పోలీస్ అధికారులు తెలుగు రాష్ట్రంలో ఉండటం మనందరి అద్రుష్టం.. స్నేహ ధర్మం పాటించే అవకాశం వచ్చిన సందర్భంలో స్పందించి ముందు నిలవడం ఎంతో అవసరం.

also read;-ఉక్రెయిన్ అధ్యక్షుడితో 35 నిమిషాల పాటు మాట్లాడిన ప్ర‌ధాని మో

దీమరీ ముఖ్యంగా స్నేహితుడి కుటుంబం కష్టాల్లో ఉన్నప్పుడు తోడుగా నిలవడం స్నేహానికి మరింత విలువనిస్తుంది. అదే చేస్తున్నారు 2009 బ్యాచ్ మెంట్స్.. ప్రస్తుతం సీఐలుగా తెలుగు రాష్ట్రాల్లో పనిచేస్తున్నప్పటికి స్నేహితుడికి ఎదైనా జరిగితే అందరు ఒకే గూటికి(సోషల్ మీడియా) చేరి ఆ కుటుంబాన్ని అదుకునే విధానం అందర్ని అకట్టుకుంటోంది.. అంతే కాదు ఆ ఆపీసర్స్ యావత్తు సమాజానికే ఆదర్శంగా నిలిచారు.

== బ్యాచ్ మెంట్ కుటుంబానికి రూ.29లక్షల చేయూత
మహబూబ్ నగర్ రైల్వే సబ్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న పల్లె రాఘవేందర్ గౌడ్ ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. 2009 బ్యాచ్ కు చెందిన రాఘవేందర్ మరణంతో అతని కుటుంబ సభ్యులతో పాటుగా, ఒకే శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన స్నేహితులకు తీవ్ర ఆవేదన కలిగించింది. ఇటువంటి విషాద సమయంలో స్నేహితుడి కుటుంబానికి అండగా నిలవాలని తలచిన 2009 బ్యాచ్ మేట్స్, తామంతా కలిసి రూ.29లక్షలను జమ చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో పని చేస్తున్న (1103) బ్యాచ్ మెంట్స్ అనుకున్నదే తడవుగా ఈ డబ్బును జమ చేస్తూ, తమకు దూరమైన స్నేహితుడి పిల్లల భవిష్యత్తు కొరకు ఆ కుటుంబానికి అందజేశారు. సోమవారం మధ్యాహ్నం జరిగిన దశదిన కర్మ రోజున ఈ డబ్బును రాఘవేందర్ కుటుంబానికి అందయజేయడం జరిగింది.

also read;-ప్రజారంజక బడ్జెట్ : నామా

గతం లోను ఏలూరు రేంజ్ లో చనిపోయిన ఇద్దరు ఆఫీసర్స్ కి రూ.55 లక్షలు వరకు, హైదరాబాద్ రేంజ్ లో సుల్తాన్ బజార్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తూ గత సంవత్సరం అబ్దుల్లాపుర్ మెట్ రోడ్డు ప్రమాదం లో చనిపోయిన లక్ష్మణ్ పిల్లలకు రూ. 45 లక్షలు వరకు రెండు రాష్ట్రాలు లో పనిచేస్తున్నా 2009 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్స్ ఇవ్వడం జరిగింది.. అందులో మురళి, వసంత్, కరుణాకర్, సతీష్, సురేష్, హారీఫ్, సర్వయ్య, వి.వి.ప్రసాద్, రామకష్ణ, నవీన్, మల్లయ్య, లు ఆ బ్యాచ్ కు చెందిన వీరు ప్రస్తుతం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీఐలుగా పనిచేస్తున్నారు.

also read;-తెలంగాణ రాష్ట్ర 2022-23 వార్షిక బడ్జెట్ లో 2,56,958 కోట్ల రూపాయలతో అభివృద్ధి

దీంతో ఈ విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు 2009 బ్యాచ్ సీఐలను అభినందిస్తున్నారు. అలాగే ఈ సమాచారం తెలుసుకున్న ప్రజలు, ఉధ్యోగులు అభినందిస్తున్నారు. విజయం తెలుగు దినపత్రిక తరుపున 2009 బ్యాచ్ కు చెందిన సీఐల అందరికి అభినందనలు.. మున్ముందు మీ అందరి ఐక్యత ఇలాగే కొనసాగాలని, ఇలాగే స్నేహితులకు అండగా ఉంటూ అందరికి అదర్శంగా నిలవాలని మనస్పూర్తిగా పత్రిక యజమాన్యం కొరుతూ ఆల్ దిబెస్ట్ చెబుతోంది..