ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం: మంత్రి హర్షం
▪️ఆర్టీసీ విలీనం బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపింది.
ప్రభుత్వంలో ఆర్టీసి విలీనం: మంత్రి హర్షం
▪️ఆర్టీసీ విలీనం బిల్లుకు ఎట్టకేలకు గవర్నర్ ఆమోదం తెలిపింది.
▪️నేటి నుండి ఆర్టీసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు..
▪️చారిత్రాత్మక నిర్ణయం తీసుకుని అమలు చేసిన కేసీఅర్ గారికి కార్మికుల తరుపున కృతజ్ఞతలు తెలిపిన మంత్రి పువ్వాడ.
దాదాపు నెల రోజుల తర్వాత ఆర్టీసీ బిల్లుపై గవర్నర్ తమిళిసై గురువారం ఆమోద ముద్ర వేసింది.
టీఎస్ ఆర్టీసీ కార్మికుల కొన్ని ఏళ్ళ కల ఫలించిందని, ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు నేడు ఆమోదం పొందడం పట్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు హర్షం వ్యక్తం చేశారు.
ఇది కూడా చదవండి: ఖమ్మంలో పదికి పది సీట్లు గెలుస్తాం: మంత్రి హరీష్
ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్టీసి ఉద్యోగులందరికీ మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆలస్యంగా అయినా రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ బిల్లుకు ఇవాళ ఆమోదం తెలపడం పట్ల వారికి ధన్యవాదాలు తెలిపారు..
నేటి నుండి ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారని, తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెల రోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారని పేర్కొన్నారు.
దీర్ఘకాలికంగా ఆర్టీసి ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యను ముఖ్యమంత్రి కేసీఅర్ గారు చారిత్రాత్మకమైన నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో పెట్టీ అమలు చేసిన తీరు దేశానికే అదర్శనియమన్నరు.
ఆర్టీసి ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తూ సిఎం కేసీఅర్ గారు తీసుకున్న నిర్ణయం రవాణా శాఖ మంత్రి హోదాలో ఉన్న సమయంలో బిల్లు అమలు అవడం నాకు ఆ అదృష్టం కల్పించిన కేసీఅర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.