Telugu News

పదినిమిషాల ఆలస్యం విద్యార్థిని పానం తీసింది…!

సప్లమెంటరీ పరీక్ష రాయలేదని ఆత్మహత్య చేసుకున్న సమీరా

0

పదినిమిషాల ఆలస్యం విద్యార్థిని పానం తీసింది…!

== సప్లమెంటరీ పరీక్ష రాయలేదని ఆత్మహత్య చేసుకున్న సమీరా

(రిపోర్టర్ : గడిపల్లి శ్రీనివాస్)

మహబూబాబాద్ ప్రతినిధి ఆగస్టు 2 (విజయం న్యూస్)

పదినిమిషాల ఆలస్యం విద్యార్థిని ప్రాణం తీసింది. పరీక్ష రాయలేదని మనస్థాపం చెందిన ఆ విద్యార్థిని  పురుగులు మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన కేసముద్రంలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో మంగళవారం నిర్వహిస్తున్న ఇంటర్ సప్లిమెంటరీ ఫస్ట్ ఇయర్ ఇంగ్లీష్ పరీక్షకు జాటోతు సమీరా అనే విద్యార్థిని 10 నిమిషాలు ఆలస్యం వచ్చింది. దీంతో అధికారులు విద్యార్థినికి పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వలేదు. పరీక్ష రాయలేదని మనస్థాపం చెందిన సమీరా ఇంటికి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థిని క్షేమంగా ఉన్నట్లు సమాచారం.ఈ సందర్భంగా కాలేజ్ సీఎస్ అజీజ్ బేగ్ మాట్లాడుతూ.. ఇంటర్ నిబంధనల మేరకు ఒక్క నిమిషం ఆలస్యమైన పరీక్ష రాసేందుకు అనుమతి ఇవ్వమని తెలిపారు.

ఇది కూడా చదవండి : వైరా ఎమ్మెల్యే కు తప్పిన ప్రమాదం