నిండు వర్షంలో ఎంపీ,ఎమ్మెల్యే నిరసన
◆◆ మోడీకి పెంచడం అమ్మడమే తెలుసు…!
◆◆ గ్యాస్ ధర పెంపుపై టిఆర్ఎస్ నిరసనలు
◆◆ ఎంపీ కవిత, ఎమ్మెల్యే శంకర్ నాయక్
మహబూబాబాద్ జులై 8 (విజయం న్యూస్)
మోడీ ప్రభుత్వము అన్ని పెంచుకుంటూ అముకుంటూ పోవడం తప్ప ఏమి తెలియదని మహబూబాబాద్ జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు ఎంపీ మాలోత్ కవిత, ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ అన్నారు. తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలో గ్యాస్ ధరలు పెంపు పై కేంద్ర ప్రభుత్వం సామాన్యుడిపై అవలంబిస్తున్న తీరుపై మహబూబాబాద్ పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు వర్షాన్ని సైతం లెక్క చేయకుండా కట్టెల పొయ్యి మీద వంట చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
Allso read:- రేగా కాంతారావు దద్దమ్మ ఎమ్మెల్యే: పాయం
ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యే మాట్లాడుతూ. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం భారీగా గ్యాస్ సిలిండర్ పై 50 రూపాయలు పెంచి వంటిట్లో మంట పెడుతున్నారని మోడీ ప్రభుత్వంపై ప్రజలు మహిళలు అసంతృప్తి తో ఉన్నారని దీనికి నిరసనగా మహబూబాబాద్ నియోజకవర్గం లోని వివిధ మండలాల్లో టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
మోడీ ప్రభుత్వము అన్ని పెంచుకుంటూ పోతుంటే సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్నిటికీ సబ్సిడీలు ఇస్తూ పేద ప్రజలను కాపాడుతున్నారని మోటర్లకు మీటర్లు పెట్టి రైతన్నకు కరెంట్ షాక్ ఇవ్వాలని చూసిన మోడీ కుట్రను తిప్పి కొట్టిన గొప్ప సీఎం కేసీఆర్ అని అన్నారు.మోడీకి అన్ని అమ్మడమే తెలుసు,ప్రజల ఆస్తులు ఆదని, అంబానిలకు దోచి పెట్టడమే తెలుసు.పేదోడికి అన్నం ముద్ద పెట్టేది మాత్రం తెల్వదని సూటు బూటు వేశాలను తెలంగాణ ప్రజలు,దేశ ప్రజలు గమనిస్తున్నారని మోడీ కాలం చెల్లించని అన్నారు.
allso read:- ఖమ్మం మార్కెట్ లో మిర్చి ధర రికార్డ్
రాష్ట్ర బీజేపీ నాయకులు దేశాన్ని అమ్ముతు,రేట్లు పెంచుతున్న మోదీని దేవుడంటరూ..మరి పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని పేద ప్రజల బాగోగుల కోసం నిరంతరం పాటు పడుతున్న సీఎం కేసీఆర్ ని ఇష్టం వచ్చినట్లు తిడుతారని ఇదేనా మీ నీతి,అన్ని అమ్మే మోడీ దేవుడు,అన్నం పెట్టే సీఎం కేసీఆర్ రక్షసుడనటం. ఎంతవరకు న్యాయమని ప్రజలు మీ మాటలు విని సిగ్గు పడుతున్నారని చెప్పారు. బీజేపీ నాయకులకు ఇక కాలం చెల్లిందని ప్రజలే తిరగబడే రోజులు వచ్చాయని జాగ్రత్తగా తిరగండి అని హెచ్చరించారు.
సీఎం కేసీఆర్ అన్ని పథకాలు అమలు చేస్తున్నా బీజేపీ నాయకుల కండ్లకు కనపడటం లేదా..బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ ఇచ్చే అన్ని పథకాలు తీసుకుంటు
మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి సీఎం కేసీఆర్ ఏమి చేశాడు అని మాట్లాడడం విడ్డూరంగా ఉందని అన్నారు.
కల్యాణ లక్ష్మీ, షాధి ముబారక్,కేసీఆర్ కిట్,రైతు బంధు,రైతు బీమా,ఇలా ఎన్నో పతకాలు బీజేపీ నాయకులు తీసుకున్నారుని దమ్ముంటే బీజేపీ నాయకులు చర్చకు రావాలని సవాల్ విసిరారు.ఈ కార్యక్రమంలో మహబూబాబాద్ మున్సిపల్ చైర్మన్ డా, రామ్మోహన్ రెడ్డి , వైస్ చైర్మన్ ఎండి ఫరీద్ , పట్టణ అధ్యక్షులు గద్దె రవి గారు , సీనియర్ నాయకులు పరకాల శ్రీనివాస్ రెడ్డి , చిట్యాల జనార్దన్ , తెల్ల శ్రీనివాస్ , కే ఎన్ రెడ్డి , గోగుల రాజు , యాకుబ్ రెడ్డి , లునవాత్ అశోక్ , యళ్ల మురళీధర్ రెడ్డి , జడ్పీ కో అప్సన్ పాషా, ఆవుల వెంకన్న , బాలు నాయక్ , పట్టణ వార్డు కౌన్సిలర్లు , తెరాస సీనియర్ నాయకులు , పట్టణ వార్డు అధ్యక్ష కార్యదర్శులు , వివిధ గ్రామ సర్పంచులు , ఎంపీటీసీలు , తెరాస యూత్ నాయకులు , తదితరులు పాల్గొన్నారు.
Allso read:- కూలీన ఇళ్ళు.. వృద్ధురాలుకు తృట్టిలో తప్పిన పెను ప్రమాదం