Telugu News

నర్సింహులపేటలో విషాదం..

పాఠశాలలో విద్యార్ధి మృతి

0

నర్సింహులపేటలో విషాదం..

◆◆ పాఠశాలలో విద్యార్ధి మృతి

◆◆ మిన్నంటిన రోధనలు

◆◆ ఉపాధ్యాయుల తీరుపై అనుమానాలు

మహబూబాబాద్ జూన్ 25 (విజయం న్యూస్)

మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలోని హైస్కూల్ విషాదం నెలకొంది. పాఠశాలలో 9 వతరగతి చదువుతున్న భూక్యా అఖిల్ విద్యార్ధి మృతి చెందాడు. తరగతి గదిలో ఫిట్స్ రావడం తో అపస్మారక స్థితిలోకి చేరుకోవడం తో ఉపాధ్యాయులు ఆర్ఎంపీ డాక్టర్ ను సంప్రదించంగా పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో ఉపాధ్యాయులు 108 అంబులెన్స్ కు కాల్ చేశారు. 108 అంబులెన్స్ సిబ్బంది వచ్చి పరిశీలించి చనిపోయాడని నిర్ధారించి పోయారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు హాటాహుటిన స్కూల్ కు చేరుకున్నారు. వారి రోదనలు మిన్నటాయి. దీంతో నర్సింహులపేటలో విషాదం నెలకొంది. అయితే  ఉపాధ్యాయుల పాత్రపై పలువురు అనుమానాలను వ్యక్తంచేశారు.  చనిపోయిన డెడ్ బాడీ ని ప్రయివేటు వాహనంలో హాస్పిటల్ కు తరలించాలి. అలా జరగలేదు.

Allso read:- శీనన్నా..నీ అభిమానానికి వందనం..
హెడ్ మాస్టర్ ఉపాధ్యాయుల నిర్లక్ష్యం వల్లనే మా అబ్బాయి చనిపోయాడని విద్యార్థి తల్లితండ్రులు ఆరోపిస్తున్నారు.