ఇంటర్లో తక్కువ మార్కులు వచ్చాయని విద్యార్థి ఆత్మహత్య…!
◆◆ విషాదంలో కుటుంబ సభ్యులు
మహబూబాబాద్ జూలై 1 ( విజయం న్యూస్)
ఇంటర్ పూర్తి చేసుకున్న ఓ విద్యార్థి బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. దంతాలపల్లికి చెందిన వాడపల్లి భారత్ కుమార్(19)హన్మకొండలోని ఓ గురుకులంలో ఇంటర్ పూర్తి చేయగా పరీక్షా ఫలితాలలో 860 మార్కులు రాగా,
Allso read-కేంద్రంపై నిప్పులు చెరిగిన సీతక్క
తక్కువ మార్కులు వచ్చాయని తీవ్ర మనస్తాపానికి గురై ఆతహత్య చెసుకుంటున్నట్లు తన తండ్రికి వాట్సాప్ మెసేజ్ పంపాడు. బంధువులు, పోలీసుల సహాయంతో మొబైల్ లొకేషన్ ఆధారంగా గాలించారు. కాగా మండల కేంద్రం శివారు ఎలుకల గుట్టలో ఓ రైతు బావి వద్ద బైక్, చెప్పులు ఉన్నట్లు గుర్తించారు. దీంతో పోలీసులు గజ ఈతగాళ్ల సహాయంతో గాలించారు. రాత్రి 10:30 గంటలకు మృతదేహం లభ్యమైంది. తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.