Telugu News

చెరువులో విషప్రయోగం…చేపలు మృతి…!

పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు

0
చెరువులో విషప్రయోగం…చేపలు మృతి…!
== పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు
మహబూబాబాద్ జూన్ 19 (విజయం న్యూస్)
చెరువులో విష ప్రయోగం చేయడం వలన చేపలు మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనుగొండ గ్రామంలో ఆదివారం నాడు చోటుచేసుకుంది.ముదిరాజ్ కులస్తులు చిన్న లక్ష్మయ్య,లాగా పెద్ద లక్ష్మయ్య,మండల మల్లేష్,మండల నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం పెనుగొండ గ్రామ శివారులోని పాతాళ కుంటలో గుర్తుతెలియని వ్యక్తులు విషప్రయోగం చేయడం వలన చాపలు చనిపోయాయని తెలిపారు.ఈ సంఘటనతో ముదిరాజు కులస్తులు లబోదిబోమంటున్నారు. చెరువులో విషం కలపడం వలన సుమారుగా లక్షా 50 వేల రూపాయల నష్టం వాటిల్లిందని బోరున విలపిస్తున్నారు.ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెరువులో రసాయన మందులు కలపడంతో చేపలు మొత్తం చనిపోయాయని ఆవేదన చెందుతున్నారు.ప్రభుత్వ అధికారులు స్పందించి చెరువులో విష ప్రయోగం చేసిన వారిని గుర్తించి వారిని శిక్షించి తమకు నష్ట పరిహారం అందజేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.