Telugu News

ఆ గ్రామం క్రీడాకారులకు పుట్టినిల్లు…!

-జయపురం టూ ఖజకిస్తాన్... లావణ్య విజయకేతనం

0

ఆ గ్రామం క్రీడాకారులకు పుట్టినిల్లు…!

-జయపురం టూ ఖజకిస్తాన్… లావణ్య విజయకేతనం

-దేశం తరఫున వాలీబాల్ ఆడుతున్న క్రీడాకారిణి

మహబూబాబాద్ జులై 03 (విజయం న్యూస్)

జయపురం గ్రామం ఎంతోమంది క్రీడాకారులకు పుట్టిన ఇల్లు. అదొక మారుమూల గ్రామం. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం జయపురం గ్రామానికి చెందిన చందు లావణ్య వాలీబాల్ లో మెరస్తున్నది. అనతికాలంలోనే అందివచ్చిన అవకాశాలను అందిపుచ్చుకుని అంతర్జాతీయ స్థాయికి ఎదిగింది. ఆసియా అండర్ 20 వాలీబాల్ టోర్నీకి ఎంపికై నేటి నుండి 11 వరకు ఖజకిస్తాన్ లో జరిగే మెగా టోర్నీలో భారత్ తరపున బరిలో దిగుతున్నది. జయపురం గ్రామ వాసి అయిన లావణ్యది నిరుపేద కుటుంబం. తండ్రి చందు బిక్షం దివ్యాంగుడు.

allso read- కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఒక అజ్ఞానాని

కాగా తల్లి రాజమ్మ రోజువారీ కూలి పనికి వెళుతున్నది. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించింది. ఒకటవ తరగతి నుండి ఏడవ తరగతి వరకు జయపురంలో, ఎనిమిది నుండి పది వరకు నర్సింహులపేట జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో విద్యను అభ్యసించింది. తరువాత కరీంనగర్ జిల్లాలోని చింతకుంటలో ఇంటర్ విద్యను చదుతున్నది.జయపురం గ్రామానికి చెందిన నెలకుర్తి వీరారెడ్డి రిటైర్డ్ పీఈటీ జయపురం ప్రాథమికోన్నత పాఠశాలలో వాలీబాల్ సమ్మర్ క్యాంపును నెల రోజుల పాటు ఏర్పాటు చేయగా ఆటలో మెళకువలు నేర్చుకుంది. వీరారెడ్డి సహయ సహకారాలతో చందు లావణ్య తెలంగాణ జట్టు తరఫున ఎనిమిది సార్లు జాతీయ స్థాయిలో ఆడి ప్రతిభను కనబర్చింది. లావణ్య 2018లో మంచిర్యాలలో నిర్వహించిన సబ్ జూనియర్ వాలీబాల్ షిప్ లో గోల్డ్ మెడల్ కైవసం చేసుకుంది. 2019లో నిజామాబాద్ ఎస్జీఎఫ్ చాంపియన్ షిప్ లో గోల్డ్ మెడల్ ను, 2019లో ఖమ్మంలో జరిగిన రాష్ట్ర స్థాయి క్రీడల్లో సిల్వర్ మెడల్ కైవసం చేసుకున్నది.పాఠశాల స్థాయి నుంచి వివిధ విభాగాల్లో ఎనిమిది సార్లు జాతీయ స్థాయిలో వాలీబాల్ కు ఎంపికైన లావణ్య 20 ఏండ్ల విభాగంలో భారత టీమ్ కు ఎంపికై భువనేశ్వర్ శిక్షణ పొందింది. సెలక్టర్లు లావణ్య ఆట తీరును పరిగణనలోకి తీసుకుని ఖజకిస్తాన్ లో జరిగే ఆసియా టోర్నీకి ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం నుండి ఎంపికైన చందులావణ్య ఆసియా టోర్నీలో రాణించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోచ్ వీరారెడ్డి, గ్రామస్తులు, క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయిలో మరోసారి గుర్తింపును సాధించి జయపురం గ్రామానికి కీర్తి తీసుకురావాలని కోరుతున్నారు.

allso read- కేంద్రంపై నిప్పులు చెరిగిన సీతక్క