Telugu News

నేలకొండపల్లిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు*

పొంగులేటి సమక్షంలో చేరిక

0

*నేలకొండపల్లిలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వలసలు*
==  పొంగులేటి సమక్షంలో చేరిక*

(నేలకొండపల్లి-విజయం న్యూస్)
నేలకొండపల్లి మండలం వలసలు జోరు కొనసాగుతోంది. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు ఆ పార్దుటీ కి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ లో చేరుతున్నారు.

ఇది కూడా చదవండి:-ఎన్నికల ప్రచారంలో పొంగులేటి కుటుంబం దూకుడు

నేలకొండపల్లి మండలం బోదుల బండ గ్రామం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షులు అనంతు కాశయ్యతో పాటు రైతు సమన్వయ సమితి కన్వీనర్ కొడాలి రాజగోపాల్ రావు, సింగిల్ విండో డైరెక్టర్ గండారపు రామారావు, సీనియర్ నాయకులు, గ్రామ శాఖ సెక్రటరీ పొట్టపింజార సత్యం, సీనియర్ నాయకులు యర్రా చలపతిరావు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసారు. వీరందరూ పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో పార్టీ కండువా కప్పి వారిని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు కార్యకర్తలతో పాటు ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి:- బీఆర్ఎస్ నేతలంతా బంధి పొట్లేనా..? : కాంగ్రెస్