ఖమ్మంలో బీఆర్ఎస్ లోకి వలసలు జోరు..
== 28వ డివిజన్ కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ లో చేరిన 30 కుటుంబాలు..*
== అభివృద్ది నిరోధకులను ఒడిస్తాం.. బీఆర్ఎస్ ను గెలిపిస్తామని తీర్మానం.
== పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన మంత్రి పువ్వాడ..
(ఖమ్మం -విజయం న్యూస్)
ఖమ్మం నగరం 28వ డివిజన్ నందు కాంగ్రెస్ పార్టీ నుండి భారీ సంఖ్యలో వలసల జోరు కొనసాగుతోంది.డివిజన్ లోని ప్రకాష్ నగర్ లో 30 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి మంత్రి పువ్వాడ పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఇది కూడా చదవండి:- ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి ఆయనే : ప్రకటించిన సీఎం
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అభివృద్ది నిరోధకులను రానున్న ఎన్నికల్లో ఒడిస్తాం అని, బీఆర్ఎస్ ను అత్యధిక మెజారిటీతో గేలిపిస్తామని దీమా వ్యక్తం చేశారు.
గడచిన 10ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదని, కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వల్లే నేడు ప్రజలు, కార్మికులు సంతోషంగా ఉన్నారని స్పష్టం చేశారు.
రానున్న ఎన్నికల్లో కేసీఆర్ కి అండగా ఉండి శక్తి వంచన లేకుండా పని చేసి ఖమ్మాన్ని కేసీఅర్ కి కానుక ఇస్తామని చెప్పారు.
ఖమ్మం ప్రజలకు కనీసం సదుపాయాలు లేని సమయంలో ఇక్కడ కావాల్సిన కనీస సదుపాయాలు కల్పించడం జరిగింది అని అన్నారు.
ఖమ్మం నా ఇల్లు ,, మీరంతా నా కుటుంబ సభ్యుల వలె భావించి వేల కోట్లతో ప్రజలకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందించి అభివృద్ది చేయడం జరిగింది అని అన్నారు.
ఇది కూడా చదవండి:-ప్రభాకర్ రెడ్డి పై దాడి హేయం : ఎంపీ నామ
ఇక్కడకు వచ్చే కాంగ్రెస్ అభ్యర్థి కేవలం రాజకీయ పదవులు, రాజకీయ అవసరాల కోసమే పోటీ చేసి ప్రజలను మోసం చేయడానికి వస్తున్నడని అలాంటి వాళ్ళను తరిమి కొట్టాలని సూచించారు.
జరుగుతున్న ఈ అభివృద్ధిని సాదుకుంటారా సంపుకుంటారా అని ప్రశ్నించారు.
వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఇది కూడా చదవండి:-;అమ్ముడు పోయే సరుకు నాకు అవసరం లేదు: మంత్రి
ఈ రోజు పార్టీలో చేరుతున్న వారు విద్యాసాగర్, పాషా, నరసింహాలు, మురళి, రమణ మేస్త్రి, అంజిబాబు, సుమన్, చిరంజీవి, నరసింహారావు, ఉపేందర్, ఉమా మహేష్, వెంకటేశ్వర్లు, వీరేష్, బిబ్లా, వెంకన్న లకు స్వాగతం పలికారు.
కార్యక్రమంలో కురాకుల నాగభూషణం, ఆర్జేసీ కృష్ణ, గజ్జల లక్ష్మీ వెంకన్న, పగడాల నాగరాజు, కొప్పెర నరసింహారావు, దడాల రఘు, కోడి లింగయ్య, మెంతుల శ్రీశైలం, అమరగాని వెంకన్న గౌడ్, ధనాల కొండయ్య, యర్రా అప్పారావు, పాలగుడు పాపారావు, తోట వీరభద్రం తదితరులు ఉన్నారు.