జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు క్యాబినెట్ అమోదం
26 ఎకరాల ఎన్ఎస్పీ స్థలాన్ని కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం
జర్నలిస్టుల ఇండ్ల స్థలాలకు క్యాబినెట్ అమోదం
== 26 ఎకరాల ఎన్ఎస్పీ స్థలాన్ని కేటాయిస్తూ మంత్రి వర్గం ఆమోదం
== మనసున్న మహారాజు.. మంత్రి పువ్వాడ…!
▪️ప్రజా నాయకుడిగా ఉన్న గొప్ప పేరుతో పాటు జర్నలిస్టుల పక్షపాతిగా నిరూపించుకున్న మంత్రి పువ్వాడ.
▪️ఖమ్మంలో.. జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పంపిణీకి క్యాబినేట్ ఆమోదం..!
▪️ఇచ్చిన మాట నిలుపుకున్న మంత్రి పువ్వాడ..
▪️23 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇళ్ళ స్థలాలు..
▪️త్వరలో మంత్రి పువ్వాడ చేతుల మీదుగా పట్టాల పంపిణీ.
ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
జర్నలిస్టులకు ఇచ్చిన మాట నిలుపుకొని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జర్నలిస్టుల పక్షపాతిగా మనసున్న మహారాజుగా నిరూపించుకున్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలోని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడానికి రాష్ట్ర క్యాబినేట్ గురువారం ఆమోదం తెలిపింది. అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ స్థలాలు ఇస్తామన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు తన మాట నిలుపుకున్నారు. ఇప్పటికే ఖమ్మం నగర జర్నలిస్ట్ లకు ఇళ్ళ పట్టాలు ఇస్తామని
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఅర్ గారి హామీ మేరకు 5 ఎకరాల్లో జర్నలిస్ట్ లకు ఇంటి స్థలం ఇవ్వాలని గతంలో మంత్రి పువ్వాడ సారధ్యంలో సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక జీవో జారీ చేసింది.
ఇది కూడా చదవండి: జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డు ల సమస్య ను పరిష్కరించండి:టీజేఎఫ్
5 ఎకరాలు స్థలం సరిపోదని, అర్హులైన జర్నలిస్ట్ లందరికీ ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్ గారిని కోరిన ఖమ్మం ఎమ్మెల్యే, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారి విజ్ఞప్తి మేరకు బీఆర్ఎస్ జాతీయ ఆవిర్భావ సభలో ఇచ్చిన హామీ మేరకు హైద్రాబాద్ లో జరిగిన రాష్ట్ర క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఅర్ గారు ఆమోదం తెలిపారు. ఇప్పటికే స్థలం గుర్తించామని, ప్రతి జర్నలిస్టుకూ 200 గజాలు ఇవ్వనున్నామని సీఎం కేసీఆర్ స్పష్టంగా తెలిపారు.ఖమ్మం జిల్లా కేంద్రంలో పని చేసే జర్నలిస్టులందరికీ ఇళ్ళ స్థలాలు పంపిణీ చేస్తామన్నారు.
== మంత్రి కి టీయూడబ్ల్యూజే ధన్యవాదాలు
ఐజెయు జర్నలిస్టు యూనియన్ ఖమ్మం జిల్లా కమిటీ, ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ కమిటీ, ఖమ్మం నగర కమిటీ, ఖమ్మం ప్రెస్ క్లబ్ కమిటీల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాము.▪️జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు అప్పగించాలని గత ఏడాది నుంచి నిరంతరం కృషి చేస్తున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి శ్రీ పువ్వాడ అజయ్ కుమార్ గారికి, టిఆర్ఎస్ పార్టీ జాతీయ ఆవిర్భావ సభలో ఇచ్చిన హామీ మేరకు క్యాబినెట్ ఆమోదం చేయించిన సీఎం కేసీఆర్ కి టియుడబ్ల్యూ జే (ఐజేయు) తరపున ప్రత్యేక కృతజ్ఞతలు..
ఇది కూడా చదవండి: జర్నలిస్ట్ కుటుంబానికి ఎంపీ వద్దిరాజు చేయూత