Telugu News

రైతన్నలారా పోరాటానికి సిద్ధం కండి౼ మంత్రి పువ్వాడఅజయ్ కుమార్.

కేంద్రం మెడలు వంచి మన వడ్లను కొనిపిద్దాం.

0

రైతన్నలారా పోరాటానికి సిద్ధం కండి౼ మంత్రి పువ్వాడఅజయ్ కుమార్.

◆ కేంద్రం మెడలు వంచి మన వడ్లను కొనిపిద్దాం.

◆ రేపు 12న చేపట్టే ధర్నా ను విజయవంతం చేయాలని పిలుపు.. రైతులు,పార్టీశ్రేణులు పెద్ద ఎత్తున స్వచ్ఛదంగా పాల్గొనండి.

◆ ధర్నా విజయవంతం చేయాలని కోరుతూ ఖమ్మం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకులతో సమావేశం.

(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్):-

తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండించిన వరి ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న నిర్లక్ష్యపూరిత వైఖరిపై ఈ నెల 12న టి.ఆర్.ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టనున్న ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఖమ్మం నియోజకవర్గ పార్టీ ముఖ్య నాయకులు, కార్పొరేటర్లతో సమావేశమైన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఈ సందర్భంగా  మాట్లాడుతూ…ఆహార భద్రత చట్టం ప్రకారం రైతులు పండించిన వడ్లను. కేంద్ర ప్రభుత్వమే కొనాలి.. కానీ అందుకు వ్యతిరేకంగా కొనమని చెప్పడం కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నిలిచిందన్నారు. 14 ఏండ్ల సుదీర్ఘ పోరాటంతో కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా, సీఎం కేసీఆర్ ఎంతో ఇష్టంగా బాగు చేస్తూ, బంగారు తెలంగాణ చేస్తున్నారని తెలిపారు.

సమృద్ధిగా సాగు నీరు, రైతు బంధు, రైతు బీమా, 24 గంటల పాటు నిరాటంకంగా నాణ్యమైన విద్యుత్…చివరకు కొవిడ్ నేపథ్యంలో పంటల కొనుగోలు దాకా… రైతు అనుకూల విధానాలతో ప్రభుత్వం రైతు బంధుగా పని చేస్తున్నదని చెప్పారు.ఆత్మహత్యలు లేని, ఆకలి చావులు లేని అన్నపూర్ణ తెలంగాణ ని కెసిఆర్. రూపుదిద్దుతున్నరని చెప్పారు.ఒకప్పటి కోటి రతనాల వీణ, నేడు కోటి ఎకరాల మాగాణ మారిందన్నారు. రైతు ఏడ్చిన రాజ్యం, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం బాగుపడదన్న నానుడి ని అనుసరించి కెసీఆర్  కృషితో రైతుల మోముల్లో ఆనందాలు కనిపిస్తున్న ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా, నిరంకుశంగా ప్రవర్తిస్తున్నదని ఆరోపించారు.ఈ నిరంకుశ అన్యాయ విధానాల్ని ఎండగడుతూ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చేదాక నిరసనలు కొనసాగుతాయన్నారు.

all so read :- సత్తుపల్లిలో భారీగా గంజాయి పట్టివేత– కోటినలబై రెండులక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఓకరకంగా, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మరో రకంగా స్టేట్మెంట్లు ఇస్తున్నారని, రాష్ట్రం ఏం చెబుతుందో కిషన్ రెడ్డి చెబుతుంటే బండి సంజయ్ తప్పుపడుతున్నారని ఈ గందరగోళం తొలగించి ప్రజలకు, రైతులకు నిజాల్ని స్పష్టంగా తెలియజేయాలనే రైతు దర్నాలు నిర్వహిస్తున్నామన్నారు.

రాజ్యాంగం, వ్యవసాయ చట్టాల్ని అనుసరించి, పంటల్ని కొనుగోలు చేసే బాధ్యతను కేంద్రానికే ఇచ్చారన్నారు. తద్వారా ఏ రాష్ట్రానికి కనీస మద్దతు ధర నిర్ణయించే అధికారం, కొనుగోలు చేసి నిల్వ చేసే ఎఫ్.సి.ఐ లాంటి సంస్థల్ని ఏర్పాటు చేసే అదికారం, స్వంతంగా వ్యవసాయ ఉత్పత్తుల్ని కొని నిల్వ చేసి ఎగుమతి చేసే అదికారం, సైంటిఫిక్ గోదాముల్ని నిర్వహించే అధికారం లేదని తెలిపారు.

రైతుల పంట కేంద్రం కొనడం భిక్ష కాదని, అది రాష్ట్రాల ప్రజాస్వామ్యబద్దమైన రైతుల హక్కని అన్నారు. గతంలో లేవీ విదానం ఉన్నప్పుడు కేంద్రమే వరి పండించండి అని ప్రోత్సహించిందని తద్వారా వరి పంట సాగు క్రమంగా అలవాటైందన్నారు.

ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ గా బాసిల్లింది.. కానీ దాన్ని అధిగమించి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో వ్యవసాయం పండగల మారిందన్నారు. తద్వారా నేడు తెలంగాణ రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ గా కీర్తి సాదించిందన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వ్యవసాయం పండుగ చేస్తుంటే కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతు నడ్డి విరిచేలా ఉన్నాయని మంత్రి అన్నారు..

కేంద్రం వచ్చే యాసంగి వడ్లను కొంటామని, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కేంద్రం నుండి ఆర్డర్ కాపీ తీసుకురావాలి అని మంత్రి డిమాండ్ చేశారు..

ఇతర రాష్ట్రం లో వడ్లను ఎలా కొంటారు.. తెలంగాణ రాష్ట్రంలో వడ్లను ఎందుకు కొనరు ? పంజాబ్ లో వడ్లను కొన్నట్లే తెలంగాణ లో కూడా వడ్లను కేంద్రం కొనాలి అని మంత్రి డిమాండ్ చేశారు.

తెలంగాణలో వానాకాలం వడ్ల సేకరణ దాదాపు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ ఈ సీజన్ కి కూడా కేంద్రం వడ్లు కొంటామని లికితపూర్వక ఆర్డర్ కాపీ ఇవ్వలేదని అన్నారు.ఈ సీజన్ లో రాష్ట్ర ప్రభుత్వం కొన్న వడ్లను మరియు యాసంగి లో రైతులు పండించే వడ్లను కొనుగోలు చేస్తామని కేంద్ర ప్రభుత్వము లికితపూర్వక ఆర్డర్ కాపీ ఇవ్వాలని మంత్రి డిమాండ్ చేశారు..రైతులు పండించిన పంటలకు కేంద్రం కొనాలని, రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తే ఖమ్మంలో బీజేపీని నిలువనియ్యను.. తిరగనియ్యనని హెచ్చరించారు.ఒక్క ఎలక్షన్ కె ఎగిరెగిరి పడితే.. రాష్ట్రంలో అనేక ఎలక్షన్ నందు తెరాస పార్టీ అన్ని విజయలనే నమోదు చేసుకున్న విషయం గుర్తుంచుకోవాలన్నారు.

రేపు 12న ఖమ్మం కలెక్టరేట్ వద్ద ధర్నా చౌక్ లో ఉదయం 9:00 గంటల నుండి 12 గంటల వరకు చేపట్టే ధర్నాలో కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా జరిగే ధర్నా కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేసి కేంద్రం మెడలు వంచి కేంద్రంచే వడ్లు కొనిపిద్దాం అని కేంద్రం దిగివచ్చే వరకు ఆందోళన ఆగదని రేపటి ధర్నా ను విజయవంతం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు….

తెరాస నగర అధ్యక్షుడు పగడాల నగరాజ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో మేయర్ పునుకొల్లు నీరజ , బాలసాని లక్ష్మీ నారాయణ , డిప్యూటీ మేయర్ ఫాతిమా , సూడా చైర్మన్ విజయ్ , తెరాస జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి Rjc కృష్ణ , తెరాస ఫ్లోర్ లీడర్ కర్నాటి కృష్ణ, మాజీ నగర అధ్యక్షుడు కమర్తపు మురళి, కొత్తపల్లి నీరజ, అన్ని డివిజన్ల కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్ష, కార్యదర్శులు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

also read :- కూసుమంచిలో ప్రెస్ క్లబ్ భవనం మంజూరు సహాకరిస్తా.