Telugu News

మంత్రి ‘అజయ్’ డే.. వెరీవెరీ స్పెషల్ డే..

0

మంత్రి ‘అజయ్’ డే.. వేరీవెరీ స్పెషల్ డే

== అభివృద్ది ఖిల్లా..ఖమ్మం జిల్లా

== సుందరంగా ఖమ్మం నియోజకవర్గం

== ఊరూరికి బీటీ రోడ్లు.. గల్లిగల్లికి సీసీ రోడ్లు

= = ఖమ్మం లకారంకు కొత్త శోభ

== మున్నేరు పై తీగల వంతెన..

== మున్నేరు వరద కట్టడికి ఆర్టీసీసీ వాల్ నిర్మాణం

== గోళ్లపాడు మురికిని తరిమిన నేత

== ఖమ్మం అభివద్దికి రూ.3వేల కోట్ల నిధులు

== వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లు

== ఓపెన్ జిమ్ములు..అందమైన పార్కులు.. అహ్లాదాన్ని పంచే ప్రక్రతి వనాలు

== నాలుగేళ్లలో నలుదిక్కుల అభివృద్ది

== ప్రజలతో షేబాస్ అనిపించుకున్న మంత్రి పువ్వాడ

== ఆయన సేవల్ అదుర్స్

== రవాణాశాఖ మంత్రిగా నాలుగేళ్లు పూర్తి చేసుకున్న పువ్వాడ

== ఆయన సేవలపై ప్రశంసల జల్లు

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

ఖమ్మంజిల్లా.. అభివృద్ది జిల్లాగా మారిపోయింది.. ఖమ్మం గుమ్మం అన్ని జిల్లాలకు ఆదర్శమైంది.. అభివృద్దికి అవదులు లేవు.. ఆయన విజన్ కు తిరుగులేదు.. అద్భుతమైన నిర్మాణాలతో.. అకర్షనీయమైన కట్టడాలతో, అహ్లాదాన్ని పంచే పార్కులతో, సేదతీరేందుకు కావాల్సిన ప్రకృతివనాలతో ఖమ్మం రూపురేఖలను మార్చిన ఘనత ఖమ్మం ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణాశాఖమంత్రి పువ్వాడకే దక్కుతుందని చెప్పోచ్చు.. ఎనలేని అభివృద్దిని ప్రజలు కనులారా చూస్తున్నారు.. ఆయన చేసిన సేవలు ఆదర్స్ అనిపించేలా ఉన్నాయి.. ఎక్కడ చూసిన అభివృద్ది. గల్లిలో డ్రైనేజీలు..వీధుల్లో సీసీ రోడ్లు.. బజార్లకు బీటీ రోడ్లు..గ్రామాలకు రెండు లైన్ల రహదారులతో ఖమ్మంగుమ్మం అభివృద్ది గమ్యంగా మారిపోయింది.. రాష్ట్ర రాజదాని తరువాత అభివృద్ది విషయంలో రెండవ స్థానం సాధించిందనే చెప్పాలి. అంతటి అభివృద్దికి కారణం ఖమ్మం నగరానికి మంత్రి పదవి రావడం. ఆ పదవి పొందిన పువ్వాడ అజయ్ కుమార్ నాలుగేళ్లు పూర్తి చేసుకుని ఐదోవ సంవత్సరానికి అడుగుపెడుతున్న సందర్భంగా ‘విజయం’ ప్రతినిధి అందించే ప్రత్యేక కథనం..

ఇది కూడా చదవండి: మున్నేరుకు ఆర్సీసీ రక్షణ గోడ

తెలంగాణ రాష్ట్రంలో అత్యంత కీలకమైన ప్రాంతం ఉమ్మడి ఖమ్మం జిల్లా.. ఎన్నో వనరులకు నిలయంగా మారిన ఉమ్మడి ఖమ్మం జిల్లా తెలంగాణ రాకమునుపు అభివృద్ది విషయంలో వెనకబడి ఉంది.. పాలేరు,మధిర, ఇల్లందు, పినపాక, భద్రాచలం లాంటి పుణ్యక్షేత్రాలున్న నియోజకవర్గాలు కరువుప్రాంతాలుగా వీరాజిల్లాయి. ఖమ్మం, కొత్తగూడెం లాంటి నగరాలు, పట్టణాలు సైతం అభివృద్దికి నోచుకోలేదు. ఉమ్మడి రాష్ట్రాల్లో ఉన్న బడ్జెట్ కు, అందులో నుంచి వచ్చే అరకోర నిధులతో ఆనాటి ప్రభుత్వాలు కొంత మేరకు అభివృద్ది చేసినప్పటికి శాశ్వత పరిష్కారాలకు నోచుకోలేదు. కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం మన రాష్ట్రం, మన నిధులు, మన నీళ్లు అన్నట్లుగా వరదలా వచ్చిన నిధులతో ఉమ్మడి ఖమ్మం జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్దిబాటలో నడిపించారు. గత ఐదేళ్ల క్రితం మంత్రిగా పనిచేసిన తుమ్మల నాగేశ్వరరావు ఖమ్మం జిల్లాకు రూపురేఖలు తీసుకోస్తే, రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  ఖమ్మం నియోజవర్గాన్ని రూపుమార్చేశారు. సెప్టెంబర్ 8, 2019న మంత్రిగా సీఎం కేసీఆర్ కేబినెట్ లోకి వచ్చిన పువ్వాడ అజయ్ కుమార్, రవాణాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఖమ్మం నియోజకవర్గం రూపురేఖలను మార్చేశారు. లక్షల కోట్ల బడ్జెట్ ను ఖమ్మం జిల్లాలకు తీసుకొచ్చిన ఖమ్మం నగరంతో పాటు ఖమ్మం నియోజకవర్గం, మిగిలిన 9 నియోజకవర్గాల్లో అదే స్థాయిలో బడ్జెట్ ను కేటాయించి అభివృద్దికి సహాకరించారు. దీంతో ఖమ్మం నగరం ఎక్కడ చూసిన జిగేల్ అనిపించే విధంగా అభివృద్ది కనిపిస్తోంది. ఖమ్మం నగరంలో అద్భుతమైన ప్రధాన సెంటర్లను తయారు చేశారు. జడ్పీసెంటర్ లో డాక్టర్ అంబేద్కర్ నిలువెత్తు విగ్రహాన్ని అవిష్కరించి అంబేద్కర్ సెంటర్ గా మార్చేసి, జడ్పీసెంటర్ అనే పాత పేరును మార్చేశారు.

== నాడు మురికి కూపంగా..నేడు అహ్లాదంగా

ఖమ్మం నగరంలోనే అత్యంత దుర్మార్గమైన మురికి కాలువ ఎదైనా ఉందంటే అది గోళ్లపాడు చానల్ అని చెప్పోచ్చు. గతంలో అనేక ప్రభుత్వాలు పనిచేసిన గోళ్లపాడు చానల్ గురించి మాత్రం ఎవరు స్పందించలేదు. కానీ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కు మంత్రి పువ్వాడ అజయ్ గోళ్లపాడు చానల్ గురించి చెప్పడంతో ఆయన తక్షణమే నిధులు మంజూరు చేసి గోళ్లపాడు చానల్ ను అద్భుతంగా తీర్చిదిద్దారు. నాడు మురికి కూపంగా ఉన్న గోళ్లపాడు చానల్ దుర్గందాన్ని వెదజల్లుతే,  నేడు సుగంధాన్ని వెదజల్లుతున్నట్లు కనిపిస్తుందని స్థానికులు చెబుతున్నారు. అలాగే అనేక ప్రాంతాల్లో డ్రైనేజీలను అండర్ గ్రౌండ్ చేసి, ఖాళీ స్థలం దొరికిన చోట పట్టణ ప్రకతి వనాలనున ఏర్పాటు చేయడం జరిగింది. అంతే కాకుండా అహ్లాదాన్ని పంచేందుకు పార్కుల్లో చిన్నపిల్లల ఆటవస్తువులు, అన్ని ప్రాంతాల్లో ఒపెన్ జిమ్, ప్రతి వాడకు నాన్ అండ్ వెజ్ మార్కెట్ యార్డులను నిర్మాణం చేసి ప్రజలందరు సమానమే అన్నట్లుగా అద్భుతంగా ఏర్పాటు చేశారు.

== లకారంకు మోక్షం

ఖమ్మం నగరంలోని అత్యంత పార్క్ ఉన్న ఏకైక ప్లేస్ లకారం పార్క్.. గతంలో చిన్నపాటి చెరువుగా ఉండే ఈ లకారం చెరువును మంత్రి పువ్వాడ అజయ్ కుమర్ అద్భుతంగా నిర్మాణం చేశారు. లకారం పార్క్ ను తొలగించిన చుట్టూ చెరువును నిర్మాణం చేసి మిని రిజర్వాయర్ గా ఏర్పాటు చేసుకున్నారు. ఆ దిశగా లకారం ట్యాంక్ మారింది. ప్రస్తుతం పర్యటక ప్రాంతంగా మారింది.. ఈ లకారం ట్యాంక్ బండ్ ను అభివృద్ది చేసింది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే.

== ప్రభుత్వ భవనాల నిర్మాణం

ఖమ్మం నగరంలో స్వంత భవనాలు లేవు. చాలా భవనాలు అద్దెలో నడుస్తున్నాయి. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు అద్భుతమైన ప్రభుత్వ భవనాలను ప్రభుత్వం మంజూరు చేసి నిర్మాణం చేసింది. జిల్లా కలెక్టర్ కార్యాలయం అద్భుతం. ప్రభుత్వ కార్యాలయాలు అద్భుతంగా నిర్మాణం చేశారు. ఖమ్మం కార్పోరేషన్ కార్యాలయంతో పాటు నూతన కలెక్టరేట్, పోలీస్ కమీషనర్, అసిస్టెంట్ కమీషనర్ కార్యాలయం, ఐటీ హాబ్ తో సహా అనేక భవనాలను అద్భుతంగా కట్టడాలు చేశారు.

== మున్నేరు బాధితులకు అండగా

ఈ ఏడాది ఖమ్మం మున్నేరు ఉద్రిక్తతంగా ప్రవహించింది. సుమారు 30 అడుగల మేరక కొనసాగిన మున్నేరు ఖమ్మం నగరాన్ని, నగర ప్రజలను, ప్రజాప్రతినిధులను భయోందోళనకు గురి చేసింది. దీంతో మున్నేరు వరద విషయంలో జాగ్రత్తలు తీసుకుని వరదల్లో చిక్కుకున్న 70 మంది ప్రజలను కాపాడిన ఘనత మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దక్కుతుంది. అంతే కాకుండా ప్రతి ఏడాది మున్నేరు పై ఇదే పరిస్థతి ఉందని, అందుకే ఆర్సీసీ వాల్ నిర్మాణం చేయాలని సీఎం కేసీఆర్ కు, మంత్రి కేటీఆర్ కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చెప్పడం వెంటనే రెండు సైడ్లు వాల్ నిర్మాణం కోసం భారీగా నిధులు మంజూరు చేశారు. అంతే కాకుండా మున్నేరుపై తీగల వంతెనను నిర్మాణం చేయాలని భావించిన మంత్రి పువ్వాడ అజయ్ సీఎంను ఒప్పించి తీగల వంతెనను మంజూరు చేయించారు.  అలాగే మద్దులపల్లి మార్కెట్ నిర్మాణం, ఖమ్మం మార్కెట్ అదనపు భవన నిర్మాణాలు, వైరా, మధిర మార్కెట్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేశారు. అంతేకాకుండా ముస్లీ సోదరలుకు షాదీఖానాను మంజూరు చేయించారు. ఇలా అనేక పథకాలకు శ్రీకారం చుట్టిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అద్భుతంగా గడిచిన నాలుగేళ్లపాటు మంత్రిగా అద్భుతంగా పనిచేశారని స్వయంగా ఎన్నికల కమీషన్ అధికారులు స్పష్టం చేశారు. అంతే కాకుండా ఖమ్మం ను చూసి నేర్చుకొండి అనడం ఎంతగానో సంతోషించానని మంత్రి నేరుగా విలేకర్ల సమావేశంలో చేప్పారు.

== పట్టున్న నాయకుడిగా

ఖమ్మం నగరంలో మంత్రిగా పనిచేస్తున్న పువ్వాడ అజయ్ కుమార్ అతి సామాన్యుడిగా జీవిస్తారు. ఖమ్మం గల్లీలో సైకిల్ పై సవారి చేశాడు. క్షేత్రస్థాయిలో పట్టున్న నాయకుడిగా, రాష్ట్ర రాజధానిలో గుర్తింపు ఉన్న లీడర్ గా, ప్రజా నాయకుడిగా, అందరివాడిగా, ఖ్మ్మం ప్రజానీకం హుదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. విజన్ కు తిరుగులేని నేతగా, రాష్ట్ర రాజధాని తరువాత అభివృద్దికి చిరునామ ఖమ్మంగా నిలిపారు. రెండవ రాజదానిగా పేరు వచ్చేంత ఖమ్మం గుమ్మం నిలిచిందంటే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజలకు అందించిన సేవలు అద్భుతం అని చెప్పోచ్చు. ఖమ్మం అభివృద్దికి కంకణం కట్టుకుని మరీ నిస్వార్థమైన సేవలను అందిస్తున్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. అలాంటి నాయకుడికి ఖమ్మం జిల్లా నిరాజనం పలుకుతుంది.. వేలాధి మంది యువత మంత్రి పువ్వాడ అజయ్ వైపు వచ్చేస్తున్నారు. పార్టీ మొత్తం తమ వైపు తిప్పుకున్న నాయకుడు.

== అభివృద్ది పలాలు ఇవ్వే..

మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఖమ్మం నియోజకవర్గంలో అభివృద్ది చేసిన పనులు పరిశీలిస్తే గోళ్లపాడు చానల్ అధునీకరణ, ధంసలాపురం ప్లే ఓవర్, లకారం ట్యాంక్ బండ్, లకారం కేబుల్ వంతెన, సుందరీకరణమైనటువంటి పార్కులు, ఐటీ హబ్, సుడా పార్క్, రహదారుల విస్తరణ, అంతర్గత రోడ్లు విస్తరణ, డ్రైనేజీల ఏర్పాటు, సెంట్రల్ లైటింగ్, డివైడర్ల సుందరీకరణ, త్రాగునీటి వసతి, మురుగునీరు తొలగింపు, పేదవాడికి సొంతంటికల, నూతన కలెక్టరేట్, నూనత బస్టాండ్, రైత గోడౌమ్స్, మెడికల్ కళాశాల, నూతన కలెక్టరేట్, మున్సిపాలిటీ లాంటి ఎన్నో కట్టడాలు మంత్రి పువ్వాడ చేసినవే. మున్నేరుపై మూడు చెక్ డ్యామ్ ల నిర్మాణం, మున్నేరుకు ఆర్సీసీ వాల్ నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, వరదల సమయంలో స్వయంగా పర్యవేక్షణ చేయడం, ఎటువంటి ఇబ్బందులు కల్గకుండా చర్యలు తీసుకోవడం, ఎన్డీఆర్ఎప్, గజఈతగాళ్లను ఏర్పాటు చేయడం, ప్రజలందరికి భోజన వసతులను చూసుకోవడం, భారీ వరదలు వచ్చినప్పటికి ఒక్క ప్రాణ నష్టం కల్గకుండా చర్యలు తీసుకోవడం ఆయన కష్టానికి తగిన ఫలితంగా చెప్పుకోవచ్చు. ఖమ్మం నియోజకవర్గానికి రూ.3వేల కోట్లు, ఖమ్మంజిల్లాకు 30వేల కోట్ల నిధులను మంజూరు చేయించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. ఖమ్మం అభివృద్ది అనేది మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందించిన సేవల్లో కలికితురాయి  అని చెప్పాలి. మొత్తానికి ఖమ్మం అభివృద్దికి చిరునామా అనే అక్షర సత్యాన్ని నిజం చేసేలా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందించిన సేవలు మన జిల్లాల మంత్రులకు, ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తాయని చెప్పడంలో సందేహమే లేదు. ఏది ఏమైనా అభివృద్ది తారక మంత్రం తో ఖమ్మం ప్రజలకు అందిస్తున్న సేవలను భట్టి పువ్వాడ అజయ్ కుమార్ అజేయుడు అసాధ్యుడే… అందుకే విజయం పత్రిక తరుపున, పాఠకులు తరుపున మంత్రి పువ్వాడ అజేయు ‘డే’ శుభాకాంక్షలు…