Telugu News

తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి దాత ఐలమ్మ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి దాత ఐలమ్మ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం, సెప్టెంబర్ 26(విజయం న్యూస్)

తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన చిట్యాల (చాకలి) ఐలమ్మ జయంతి (సెప్టెంబర్ 26) సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆమె ప్రజాస్వామిక పోరాట స్ఫూర్తిని స్మరించుకున్నారు. ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి ప్రదాతగా పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి:- ఆస్ట్రేలియా పై భారత్ విక్టరీ

బందూకు చేతబట్టి దొరల గుండెల్లో సింహ స్వప్నమై గర్జించి సాయుధ పోరాటాన్ని నడిపిన వనిత అన్నారు. రజాకార్లను ఎదిరించి ఎందరో రైతులను పోరాటబాట పట్టించిన వీరనారి చాకలి ఐలమ్మ అని దున్నేవాడిదే భూమి అని ధైర్యాన్ని నింపి ప్రాణాలను ఫణంగా పెట్టి నిలిచిన తెలంగాణ నిప్పుకణం చాకలి ఐలమ్మ అని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.