Telugu News

జిల్లాకు బతుకమ్మ సారెలొచ్చాయి..

పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశం

0

జిల్లాకు బతుకమ్మ సారెలొచ్చాయి..

== నేటి నుంచి చీరలు పంపిణీ చేయనున్న మంత్రి అజయ్

==  పంపిణీ కార్యక్రమం పకడ్బందీగా చేపట్టాలి: మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశం

ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 21(విజయంన్యూస్)

తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవ పండుగైన బతుకమ్మ పండుగకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక చొరవతో రాష్ట్రం ఆడబిడ్డలకు అందించే బతుకమ్మ చీరెలు పంపిణీకి సిద్ధమయ్యాయి. ఖమ్మం జిల్లాలో 18 ఏండ్లు నిండిన మహిళలు 5,03,668 మంది ఉండగా ఇప్పటి వరకు జిల్లాకు 3,03,000 చీరెలు వచ్చాయి. మిగతా చీరెలు రెండు రోజుల్లో రానున్నాయి. జిల్లా వ్యాప్తంగా చీరెల పంపిణీకి సిద్ధం చేశారు.

ఇది కూడా చదవండి: నేలకొండపల్లి ఎస్ఐ కు కుల అహంకారం ఉంది: మంద కృష్ణ మాదిగ

ఇందుకు సంబంధించిన పంపిణీ ఏర్పాట్లను ఖమ్మం జిల్లాలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశాల మేరకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. గురువారం ఈ పంపిణీ కార్యక్రమాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. బతుకమ్మ చీరల పంపిణీని పకడ్బందీగా చేపట్టాలని జిల్లా అధికారులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆదేశించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు. 18 ఏండ్లు పైబడి తెల్ల రేషన్‌ కార్డు కలిగిన ప్రతి మహిళకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయాలని మంత్రి అజయ్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్టంలోని నేతన్నలకు చేయూతనివ్వడంతో పాటు, ఆడబిడ్డలకు ప్రేమపూర్వక చిరుకానుక ఇవ్వాలన్న ఉధాత్తమైన ఉభయతారక లక్ష్యంతో సీఎం కేసిఆర్ ఈ కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించినట్టు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా ఈ సంవత్సరం సైతం సూమారు కోటి బతుకమ్మ చీరలను పంపీణి చేయనున్నట్లు ఈ ఏడాది గతంలో కన్నా మరిన్ని ఎక్కువ డిజైన్లు, రంగుల, వైరైటీల్లో ఈ చీరలను తెలంగాణ టెక్స్టైల్ శాఖ తయారు చేసిందన్నారు. నేతన్నలకు గౌరవ ప్రదమైన ఉపాది కల్పిస్తున్న ఈ బతుకమ్మ చీరల ప్రాజెక్టు కొరకు మొత్తం రూ. 339.73 కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేసిందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

== బతుకమ్మ చీరెలను గోదాంలో భద్రపరిచిన అధికారులు

ఖమ్మం జిల్లాకు వచ్చిన బతుకమ్మ చీరలను ఖమ్మ గోదాంలో భద్రపరిచారు. ఈ మేరకు ఆ చీరలను జిల్లా జాయింట్ కలెక్టర్ మదుసూదన్, డీఆర్డీఏ పీడీ విద్యాచందన పరిశీలించారు.

ఇది కూడా చదవండి: భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత

బతుకమ్మ చీరల పంపిణీ కోసం అన్ని రకాల చీరలు  ఖమ్మం జిల్లాకు చేరినట్లు అదనప కలెక్టర్ మదుసూదన్ అన్నారు. ఖమ్మం  గోడౌన్ చేరుకున్న చీరలను అదనపు కలెక్టర్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి విద్యాచందనతో కలిసి బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 18 సంవత్సరాలు దాటి బతుకమ్మ చీరలు తీసుకోవడానికి అర్హత కలిగిన 5,03, 368 మంది మహిళలు ఉన్నట్లు తెలిపారు. జిల్లాకు ఇప్పటివరకు 3.03లక్షల చీరలు గోడౌన్ కు రావడం జరిగిందని, వీటిని 20 మండలాలకు కార్పొరేషన్కు పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. గురువారం నుంచి పంపిణి చేస్తున్నట్లు తెలిపారు.