కూసుమంచి ఏఈవోను అభినందించిన మంత్రి
ఖమ్మం జిల్లా కూసుమంచి వ్యవసాయశాఖ విస్తరణాధికారి(ఏఈవో)గా పనిచేస్తున్న జానీబాబాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు
కూసుమంచి ఏఈవోను అభినందించిన మంత్రి
(కూసుమంచి-విజయంన్యూస్)
ఖమ్మం జిల్లా కూసుమంచి వ్యవసాయశాఖ విస్తరణాధికారి(ఏఈవో)గా పనిచేస్తున్న జానీబాబాను రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అభినందించారు. ఖమ్మం ఎస్ ఆర్ గార్డెన్స్ లో జరిగిన వ్యవసాయ శాఖ ప్రణాళిక సమావేశంలో మంత్రి మాట్లాడే ముందు ఏఈవో జానీబాబాను వేదికపైకి పిలిచారు. ఈ సందర్భంగా ఏఈవోను మంత్రి కొన్ని ప్రశ్నలు వేశారు. ఏఈవోగా మీరు విధులు నిర్వహిస్తున్నారు కాదా..? ఎలా ఉంది ఉద్యోగం అని అడిగారు. దీనికి ఏఈవో మాట్లాడుతూ ఏఈవో కాకముందు చాలా ప్రైవేట్ ఉద్యోగాలు చేశానని, కానీ ఎక్కడ గుర్తింపు లేదని, కానీ ఏఈవోగా జాయిన్ అయిన తరువాత రైతులకు సేవ చేస్తున్నందుకు ఒక పక్క సంతోషం, మరోపక్క రైతులు మమ్మల్ని సార్ అని గౌరవిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు.
also read :-అజాతశత్రువు రవిచంద్రుడు
ఈవీవోగా రైతులకు ఎలాంటి సలహాలు ఇస్తున్నారని మంత్రి అడిగిన ప్రశ్నకు ఏఈవో మాట్లాడుతూ ఏఈవోగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రైతుల కోసం పనిచేస్తున్నామని, రైతుల సంక్షేమమే లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నామని, మా ఆలోచనంతా రైతులు, పంటల దిగబడి మాత్రమేనని అన్నారు. అలాగే ప్రభుత్వం రైతుల కోసం ప్రవేశపెట్టే ప్రతి పథకాన్ని అర్హులైన రైతులకు అందజేయాలనే తపనతో పనిచేస్తున్నానమి తెలిపారు. ఈ సమాదానాలకు ముగ్గుడైన మంత్రులు నిరంజన్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, రైతు బంధు సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఏఈవో జానీబాబాను అభినందించారు. ఇలాగే పనిచేస్తూ రైతుల మేలు కోరుకోవాలని, మీకు మంచి భవిష్యత్ ఉంటుందని కొనియాడారు. దీంతో ఏఈవో జానీబాబా మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు.
also read :-ఖమ్మం రైతులు దేశానికే ఆదర్శం