Telugu News

ఖమ్మంలో మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం

== అడ్డుకున్న పోలీసులు..బీజేపీ నేతల ఆందోళన == బీజేపీ కార్యకర్త ఉపేందర్ ఆత్మహత్యయత్నం == పెట్రోల్ మీదపోసుకున్న కార్యకర్త == అడ్డుకున్న బీజేపీ నాయకులు, నీళ్లు పోసి ఆసుపత్రికి తరలించిన నేతలు == రెండుగంటల పాటు ఖమ్మంలో ఉద్రిక్తత

0

ఖమ్మంలో మంత్రి దిష్టిబొమ్మ దగ్ధం
== అడ్డుకున్న పోలీసులు..బీజేపీ నేతల ఆందోళన
== బీజేపీ కార్యకర్త ఉపేందర్ ఆత్మహత్యయత్నం
== పెట్రోల్ మీదపోసుకున్న కార్యకర్త
== అడ్డుకున్న బీజేపీ నాయకులు, నీళ్లు పోసి ఆసుపత్రికి తరలించిన నేతలు
== రెండుగంటల పాటు ఖమ్మంలో ఉద్రిక్తత
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)
బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతలు విమ్మర్శలు చేస్తూ ఆయన దిష్టిబొమ్మను దగ్ధం చేసినందుకు గాను బీజేపీ నేతలు మండిపడ్డారు. బండి పై అసత్యప్రచారాలను, తప్పుడు వ్యాఖ్యలను నిరసిస్తూ బీజేపీ నేతలు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఖమ్మం నగరంలో ఆందోళన చేశారు. మంత్రి దిష్టిబొమ్మదగ్గం చేసేందుకు ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మను దగ్దం చేయోద్దని పోలీసులు బీజేపీ నేతలను వారించే ప్రయత్నం చేయడంతో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య వాగ్వాదం జరిగింది. బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ పోలీసులను ప్రశ్నించారు. సోమవారం టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేస్తుంటే ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. వెనక్కి తగ్గేదే లేదని దిష్టిబొమ్మను దగ్ధం చేస్తామని బీజేపీ నాయకులు తెల్చి చెప్పడంతో పోలీసులు నాయకులను అరెస్టు చేసే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులకు, నాయకులకు మధ్య తోపులాట జరిగింది.

ALSO READ :- దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం: ఎంపీ నామ

ALSO READ :- వరి కొనుగోలు కేంద్రం పరిశీలించిన జువ్వాడి కృష్ణారావు ….


== బీజేపీ కార్యకర్త ఆత్మహత్యయత్నం
పోలీసుల తీరును నిరసిస్తూ పోలీసులు ఖమ్మం అంబేద్కర్ సెంటర్ వద్ద బీజేపీ ఆందోళన చేస్తుండగా, అనుకోకుండా యువమోర్చా అధ్యక్షుడు అనంతు ఉపేందర్ గౌడ్ అందరికి షాక్ ఇచ్చాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేశాడు. దీంతో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉపేందర్ ను అడ్డుకుని ఆయనపై నీళ్ళు పోశారు. దీంతో అక్కడ పోలీసులు, కార్యకర్తల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టిబొమ్మ దగ్ధంకు తెరాసకు పోలీసులు అనుమతి ఇచ్చారు. బండి సంజయ్ పై టీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను ఖండిస్తూ నేడు మంత్రి అజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేయకుండా అడ్డుకుని బీజేపీ వారిని అరెస్టు చేయడమేంటని ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు టిఆర్ఎస్ కార్యకర్తల వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బిజెపి కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. ఉద్రిక్తతల మధ్య బీజేపీ నాయకులు మంత్రి పువ్వాడ అజయ్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు హాజరైయ్యారు.