Telugu News

మంత్రి ఎర్రబెల్లి మా దళితుల భూమిని ఇప్పించండి.

-అక్రమంగా కబ్జా చేసిన టీఆర్ఎస్ నాయకులపై చర్యలేవి..?

0

మంత్రి ఎర్రబెల్లి మా దళితుల భూమిని ఇప్పించండి

–అక్రమంగా కబ్జా చేసిన టీఆర్ఎస్ నాయకులపై చర్యలేవి..?

-మంచుప్పుల గ్రామంలో అధికార పార్టీపై తిరుగుబాటు

టిఆర్ఎస్ పార్టీని బహిష్కరించిన దళితులు

పాలకుర్తి-విజయం న్యూస్:

పాలకుర్తి మండలంలోని మంచుప్పుల గ్రామానికి చెందిన 40 దళితుల కుటుంబాలు టిఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేసి అధికార టిఆర్ఎస్ పార్టీని దళితవాడలో బహిష్కరించినట్లు ఇండ్ల సాధన పోరాట సమితి అధ్యక్షులు కాకర్ల రమేష్ తెలిపారు.మంగళవారం మంచుప్పుల గ్రామంలో దళిత కుటుంబాలతో సమావేశం నిర్వహించారు.ఈ సమావేశానికి పి.వెంకన్న అధ్యక్షత వహించగా రమేష్ పాల్గొని మాట్లాడుతూ మంచుప్పుల గ్రామంలో అప్పటి ప్రభుత్వం 1993లో 22వ సర్వేనెంబర్ లో 52 దళిత నిరుపేద కుటుంబాలకు అధికారికంగా ఇండ్ల పట్టాలు ఇచ్చారన్నారు.గ్రామంలో అధికార పార్టీకి చెందిన స్థానిక పాలకులు మండల అధికార పార్టీ నాయకుల అండదండలతో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు చెప్పుకొని వారి పదవులను అడ్డం పెట్టుకుని దళితుల భూమిని అక్రమంగా పట్టా చేసుకుని కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్రంలో దళితుల బతుకులు బాగుపడతాయని అనుకుంటే,దళితుల భూమిని అక్రమంగా కబ్జా చేయడమేనా బంగారు తెలంగాణ అంటే అని ఎద్దేవా చేశారు.

మంత్రి అంతర్యమేమిటో..?

గత కొన్ని నెలలుగా దళితులు పోరాటాలు చేస్తున్న స్థానిక పంచాయతీరాజ్ శాఖామంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు స్పందించకపోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
తమ నాయకుడిగా మిమ్మల్ని గెలిపించడమేనా తాము చేసిన నేరమని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా స్థానిక మంత్రి స్పందించి దళితుల పక్షాన నిలబడి,పట్టాలు ఉన్న వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్ చేశారు.లేని యెడల
ఆందోళన ఉధృతం చేసి టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో సోమయ్య,జి యాదగిరి,డి సోమన్న,బి సోమయ్య,భాస్కర్,ఏం యాక లక్ష్మి,జి లక్ష్మి,యాదమ్మ,
సుజాత,ఈ లచ్చమ్మ,
కొమరమ్మ,ఎల్లమ్మ,చంద్రమ్మ,వెంకటమ్మ,లచ్చమ్మ,వెంకటమ్మ తదితరులు పాల్గొన్నారు.

also read :- ముదిగొండ లో సాగర్ కాలువలో ముగ్గురు గల్లంతు