బి జె పి వి అసత్యపు ప్రచారం- మంత్రి గంగుల ధ్వజం
== ఐటీ, బోటీలకు భయపడం
(కరీంనగర్ -విజయం న్యూస్)
నమ్మి గెలిపించిన కరీంనగర్ ప్రజల నమ్మకాన్ని వమ్ముచేయమని,మాపై బీజేపీ నాయకులు నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
ఇది కూడా చదవండి:- ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రమాణస్వీకారం
గురువారం కరీంనగర్ 43వ డివిజన్లో 20 లక్షల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి గంగుల కమలాకర్. ఈ సందర్బంగా మాట్లాడుతూ
దర్యాప్తు సంస్థలు విచారణ చేపట్టి ఆరోపణల్లో నిజ నిజాలు తేల్చాలన్నారు.
నిరాధారమైన ఆరోపణలు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.నన్ను విచారణ కోసం హైదరాబాద్ రావాలని నిలిచారని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదు… వాళ్ళు విచారణ కోసం పిలిస్తే వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నానని అన్నారు.
దర్యాప్తు సంస్థల అధికారులకు అందుబాటులో ఉండి… వారికి కావలసిన సమాచారం ఇవ్వాలని విదేశాల పర్యటనలో ఉన్న నేను తిరిగి రావడం జరిగిందన్నారు.
ఇది కూడా చదవండి:-తుమ్మల ప్రజా…ప్రస్థానం @ 40