Telugu News

రవాణా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ

రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్ప గుచ్చా లతో అభినందనలు తెలిపిన అధికారులు..*

0

రవాణా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ..

*▪️పలు అంశాలపై చర్చ.

*▪️సేవలను మరింత విస్తృతం చేయాలని ఆదేశం..

*▪️రవాణా శాఖ మంత్రిగా మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పుష్ప గుచ్చా లతో అభినందనలు తెలిపిన అధికారులు..*

(హైదరాబాద్-విజయం న్యూస్)

ఖైరతాబాద్‌లోని రవాణా శాఖ సమావేశ మందిరంలో రవాణా శాఖ మరియు ఆర్టీసీ ఉన్నతాధికారులతో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. సోమవారం ఉదయం అధికారులతో సమావేశమైన మంత్రి పువ్వాడ పలు శాఖాపరమైన అంశాలపై చర్చించారు.

ఇది కూడా చదవండి: తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి దాత ఐలమ్మ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

రవాణా శాఖలో అందిస్తున్న పౌర సేవలు, ఆన్లైన్ సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సేవలను మరింత విస్తృతం చెయ్యాలని, మరి కొన్ని సేవలను ఆన్లైన్ ద్వారా అందించేందుకు సాధ్యమయ్యే అవకాశాలను పరిశీలించాలని అదేశించారు. ఆర్టీసీలో ప్రస్తుత బస్సులతో పాటు EV బస్సులు, దినసరి ఆదాయం తదితర అంశాలపై చర్చించారు. రవాణా శాఖ మంత్రి గా మూడేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, ఇతర ఉన్నతాధికారులు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.