Telugu News

సీఎం కేసీఆర్ పీఎం కావడం ఖాయం

విలేకర్ల  సమావేశంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

0

సీఎం కేసీఆర్ పీఎం కావడం ఖాయం

== చాయ్ వాలా పీఎం అయినప్పుడు కేసీఆర్ పీఎం కాకుడదా

== బీఆర్ఎస్ జాతీయ స్థాయిలో నెంబర్ వన్  పార్టీగా నిలుస్తుంది

== బిఆర్ ఎస్ జాతీయ రాజకీయాల్లో కొత్త మలుపు రాబోతుంది

== అన్ని పార్టీలు కేసీఆర్ వైపు చూస్తున్నారు

== భవిష్యత్ మాదే..దేశ ప్రజలందరు మావైపే

== గాంధీ ని చంపిన గాడ్సే ను పూజిస్తున్నారు

== గాంధీని సర్వత్ర విమ్మర్శిస్తున్నారు

== అలాంటి వాళ్ళకు బుద్ది చెప్పేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టారు

== విలేకర్ల  సమావేశంలో రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మంప్రతినిధి, అక్టోబర్ 20(విజయంన్యూస్)

తెలంగాణ రథసారథుడు దేశానికి ప్రధాని కావడం ఖాయమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జోస్యం చెప్పారు. గురువారం ఖమ్మంలోని వీడీవోస్ కాలనీలో ఉన్న మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ చేతుల మీదగా అవిర్భవించిన భారత్ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ను ఖమ్మం జిల్లా టీఆర్ఎస్  పార్టీ తరుపున స్వాగతిస్తున్నామని, హర్షం వ్యక్తం చేస్తున్నామని మంత్రి తెలిపారు.

allso read- అమ్మగా ఇల్లందు ఎమ్మెల్యే

పార్టీని ప్రకటించిన సీఎం కేసీఆర్ కు అభినందనలు తెలిపారు.  దొరికనదాన్నళ్లా అమ్మే ప్రధాని కాదు,ప్రజలపై భారం మోపే ప్రధాని కాదు దేశానికి కావాల్సింది, ప్రజల సమస్యలను పరిష్కరించే నాయకుడు కావాలి, దేశసంపదను పెంచే నాయకుడు కావాలని, ఆ నాయకత్వం ఉన్న సీఎం కేసీఆర్ భారతదేశానికి ప్రధానమంత్రి కాగలడని మంత్రి పువ్వాడ తెలిపారు. దేశ ప్రజలు చైతన్యవంతంగా ఆలోచించాలి కోరారు. చాయ్ వాలా ప్రధాని అయ్యి చాయి అమ్ముకునే వాళ్లే బతకలేనట్లుగా చేశారని, తెలంగాణ ముఖ్యమంత్రి అతిసామాన్యుడికి కూడా అనేక పథకాల పేరిట బతుకునిచ్చారని అన్నారు. చాయ్ వాలా ప్రధాని అవ్వంగా లేదు కానీ ప్రజల శ్రేయస్సు కోరే కేసీఆర్ ప్రధాని ఎందుకు కాకూడదో ప్రతిపక్ష,అధికార పార్టీలకే తెలవాలని సూచించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం మేరకు జాతీయస్థాయిలో టిఆర్ఎస్ ప్రభుత్వం పథకాలను అమలు చేసే సదుద్దేశంతో,  దేశంలో బిజెపి కేంద్ర పాలకుల నిర్ణయాలతో కొనసాగుతున్న నిరంకుశ పాలనను అంతమొందించేందుకు జాతీయ పార్టీగా బీఆర్ఎస్ ను  ప్రకటించడం జరిగిందన్నారు.  బిజెపి నాయకులు దేశ ప్రజలను తమ డొల్ల మాటలతో గుజరాత్ ను రోల్ మోడల్ గా చిత్రీకరిస్తూ బోగస్ ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు యావత్ దేశానికి ఆదర్శప్రాయంగా నిలిచాయని రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు  దేశానికి అవసరమవుతాయని అన్నారు. ఆ పథకాలు యావత్ దేశంలో అమలు కావాలని యావత్ దేశ ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు.

allso read- కూసుమంచి లో రోడ్డు ప్ర‌మాదంలో ఒక‌రు మృతి

టిఆర్ఎస్ పార్టీ ఇక బిఆర్ ఎస్ పార్టీ గా మారిందని, ఆ పార్టీకి కేసీఆరే జాతీయ పార్టీ అధ్యక్షుడు గా ఉంటారని అన్నారు. దేశంలో మతం పేరుతో, కులం పేరుతో విభజన రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. గాంధీని చంపిన గాడ్సే ను పూజిస్తున్నారని అన్నారు. బుల్ డోజర్ పేరుతో రాజకీయ పార్టీలు ను దారిలో పెట్టుకుని ప్రయత్నం బిజెపి చేస్తుందని అన్నారు. ఈడి దాడులు పెరిగాయి. దాడులతో దారిలోకి తెచ్చుకోవాలని అనుకుంటున్నారని,ఆయన దాడులకు ఎవరు భయపడేదిలేదని అన్నారు.  దేశంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలలో కీలకంగా మారుతారని, రాబోయే రోజుల్లో అనుకూల వాతావరణం ఉంటుందని అన్నారు. తెలంగాణ లో పచ్చని పైర్లు, రోడ్లు బాగా ఉన్నాయని, తెలంగాణ అభివద్దిని దేశమంతా కోరుకుంటుందన్నారు. మహారాష్ట్ర లో పచ్చని పైర్లు లేవు…రైతుల ఆత్మహత్య లు పెరిగాయని, కర్ణాటక లో కూడా దళితుల మీద దాడులు పెరిగాయని గుర్తు చేశారు. ఆ రాష్ట్రాల్లో ప్రజాస్వామ్యమే లేదని, ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు.

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరును సచివాలయం కు పెట్టుకున్నామని, పార్లమెంటు కు అంబేద్కర్ పేరు పెట్టమంటే కనీసం మాట్లాడ లేదని ఆరోపించారు. దేవ గౌడ, కుమార్ స్వామి లాంటి నేతలు తెలంగాణ మోడల్ అంటున్నారని, గుజరాత్ లో కరెంటు కోతలు ఉన్నాయి… రైతుల ఆత్మహత్య లు పెరిగాయని అన్నారు. తెలంగాణలో నాణ్యమైన 24గంటల కరెంట్ ఇస్తున్నామని, బీజేపీ పాలిత ఏ రాష్ట్రంలో 24గంటల కరెంట్ లేదన్నారు. అందుకే దేశ ప్రజలందరు బీఆర్ఎస్ వైపు చూస్తున్నారని, వివిధ పార్టీలు కూడా సీఎం కేసీఆర్ పెట్టిన బీఆర్ఎస్ పార్టీ వైపు  చూస్తున్నాయని అన్నారు. కచ్చితంగా దేశంలో బీఆర్ఎస్ సక్సెస్ అవుతుందని, కేసీఆర్ ప్రధాని అవ్వడం ఖాయమన్నారు. మేమంతా జాతీయ పార్టీ నాయకులమని, సీఎం కేసీఆర్ నాకు ఏ బాధ్యత ఇచ్చిన పనిచేసేందుకు సిద్దంగా ఉన్నానని అన్నారు.

allso read- టీఆర్ఎస్ ఇక నుంచి బీఆర్ఎస్

కేంద్రమంత్రిగా భవిష్యత్ లో చూడోచ్చా..? అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  నేను లోకల్ నాయకుడ్ని అని, జాతీయ నాయకత్వం పై సీఎం కేసీఆర్ చూసుకుంటారని తెలిపారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఆయన తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. రేవంత్ రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం కావడం ఖాయమన్నారు. బీఆర్ఎస్ బీజేపీకి ప్రత్యామ్నయమా, కాంగ్రెస్ కు ప్రత్యామ్నయమా అని విలేకర్లు అడిగిన ప్రశ్నకు స్పందించిన మంత్రి మాట్లాడుతూ మాకు మీమే ప్రత్యామ్నయమని, ప్రజలందరు మా వైపు చూస్తున్నారని, సీఎం కేసీఆర్ పాలన వైపు చూస్తున్నారని, సీఎం కేసీఆర్ పాలన కావాలని కోరుకుంటున్నారని అన్నారు. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలకు పతనం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే, విత్తనాభివద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, మేయర్ పూనకొల్లు నీరజ, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగర కమిటీ అధ్యక్షుడు పగడాల నాగరాజు తదితరులు హాజరైయ్యారు.