Telugu News

గోదావరి వరదను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి పువ్వాడ

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై ఆరా

0

గోదావరి వరదను ఎదుర్కొనేందుకు సిద్ధం : మంత్రి పువ్వాడ

 == భద్రాచలం వద్ద గోదావరి ఉధృతిపై ఆరా

 == అధికారులకు మంత్రి అజయ్ కీలక ఆదేశాలు

 == క్షణక్షణం..అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు 9(విజయంన్యూస్)

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం, పెరుగుతున్న వరద ఉధృతిపై మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ ఆరా తీశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సహాయక చర్యలు, ముంపు ప్రాంతంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలపై జిల్లా కలెక్టర్, ఇతర అధికారులతో మంత్రి అజయ్ ఫోన్ లో మాట్లాడి వారికి దిశానిర్దేశం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలని, నిత్యావసరాలు అందుబాటులో ఉండేలా తీసుకోవాల్సిన‌ రక్ష‌ణ, సహాయక చ‌ర్య‌ల‌పై అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. స్థానిక అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రతినిత్యం సహాయక చర్యలను కొనసాగించాలన్నారు. అవసరమైన చోట తీసుకోవాల్సిన తక్షణ చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఎలాంటి విపత్కర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ప్రభుత్వ యంత్రాంగం సంసిద్ధంగా ఉందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు. వరద ముంపు వాసులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని మంత్రి భరోసా కల్పించారు.  అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలని పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు, ఆహారం, త్రాగునీరు, మెడిసిన్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచుతూ బ్లీచింగ్ శానిటేషన్ చేయలన్నారు. రెవెన్యూ, పంచాయతీ రాజ్‌, ఇరిగేషన్‌, విద్యుత్‌, పోలీస్‌, ఆరోగ్యశాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు ప్రమాదాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాలని, జిల్లాలో ప్రాణ, ఆస్తి నష్టం ఉండద్దన్నారు. అధైర్య పడవద్దని అండగా నేనున్నానంటూ జిల్లా ప్రజలకు ఆయన భరోసా ఇచ్చారు. అవసరమైతే తప్ప ఇండ్ల నుంచి బయటికి రావద్దని, తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విజ్ఞప్తి చేశారు.

allso read- పెరుగుతున్న గోదావరి వరద