Telugu News

ఈనెల 4న మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన.

** మంత్రి కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ

0

ఈనెల 4న మంత్రి కేటీఆర్ ఖమ్మం జిల్లా పర్యటన

** మంత్రి కేటీఆర్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి పువ్వాడ
(ఖమ్మం ప్రతినిధి- విజయం న్యూస్);-

ఈ నెల 4న ఐటీశాఖ మంత్రి కే.తారకరామారావు ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. శుక్రవారం
నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఐటి, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం వారికి శాలువతో సత్కరించారు.

ఈ నెల 4వ తేదీన మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటన ఖరారు అయిన సందర్భంగా మంత్రి కేటీఆర్ ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కలిసి సాధరంగా జిల్లాకు ఆహ్వానించారు. ఈనెల 2న మంత్రి కేటీఆర్ పర్యటించాల్సి ఉండగా అనివార్య కారణాలవల్ల వాయిదా పడింది. కాగా తిరిగి ఈనెల 4న మంత్రి కేటీఆర్ పర్యటన ఖరారైంది. దీంతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రకటించారు.

also read :-రాష్ట్ర ప్రజలకు మంత్రి పువ్వాడ 2022-నూతన సంవత్సర శుభాకాంక్షలు..