Telugu News

మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి

★ పార్టీ శ్రేణులకు మంత్రి పువ్వాడ పిలుపు

0

మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతం చేయాలి

★ పార్టీ శ్రేణులకు మంత్రి పువ్వాడ పిలుపు
(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

జనవరి 4వ తేదీన ఖమ్మంలో పలు అభివృద్ధి పనులకు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీ కేటీఆర్ విస్తృత పర్యటనను విజయవంతం చేయాలని టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు.

ఖమ్మం నగరంలో రూ.30 కోట్లతో చేపట్టే గోళ్లపాడు ఛానల్‌ ఆధునీకరణ పనులు, రూ.20కోట్లతో నిర్మించే స్కూల్‌ ఆఫ్‌ ఎక్సలెన్సీకి భవన నిర్మాణానికి, ప్రకాశ్‌నగర్‌లో మురుగునీటి వ్యర్థాల శుద్ధీకరణ ప్లాంటు నిర్మాణానికి మరియు దానవాయిగూడెంలో మానవ వ్యర్థాల శుద్ధి ప్లాంటు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారని మంత్రి పువ్వాడ తెలిపారు. రూ.8.50 కోట్లతో నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందించేందుకు పర్యాటకంగా తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ఏర్పాటు చేసిన కేబుల్‌ బ్రిడ్జి తో పాటు ఐటీ హబ్ నుంచి జెడ్పీ సెంటర్ వరకు ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ లను మంత్రి కేటీఆర్‌ ప్రారంభిస్తారన్నారు.

నగరంలో దాదాపు రూ.1000 నుంచి రూ.1500 కోట్లతో అనేక అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తయినట్టు, రూ.230 కోట్లతో మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికి శుద్ధజలం అందజేస్తున్నామని మంత్రి అన్నారు. రూ.70 కోట్లతో గోళ్లపాడు ఛానల్‌ ఆధునీకరణ పనులు చేపట్టామని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రత్యేకంగా అందిస్తున్న రూ.100 కోట్ల ఎల్‌ఆర్‌ఎస్‌ నిధులతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు మంత్రి అజయ్ కుమార్ వివరించారు. నగరంలో దాదాపు రూ.200 కోట్లతో 2వేల డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు కేటాయించినట్లు, రఘునాథపాలెం మండలంలో రూ.75 కోట్లతో రోడ్ల నిర్మాణం చేపట్టామని, నగరం నుంచి బోనకల్లు వెళ్లేందుకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని రూ.70 కోట్లతో ధ్వంసలాపురం వద్ద రైల్వే ఓవర్‌బ్రిడ్జిని నిర్మించామని మంత్రి పేర్కొన్నారు.

ALSO READ :-దక్షణాఫ్రికాపై ఇండియా తొలిటెస్ట్ విజయం