Telugu News

ప్రతి ఇంటికి ప్రభుత్వం పథకం వచ్చింది :మంత్రి పువ్వాడ

పాలేరు నియోజవర్గంలో పర్యటించిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

0

ప్రతి ఇంటికి ప్రభుత్వం పథకం వచ్చింది

==  పధకం అందని ఇల్లు ఉందా..?

== ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

== 24గంటల కరెంట్ ఇచ్చిన ఘనత సీఎం కేసీఆర్  దే

== 57ఏళ్లకే పింఛన్ ఇచ్చిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదే

== స్పష్టం చేసిన రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

== పాలేరు నియోజవర్గంలో పర్యటించిన మంత్రి, ఎంపీలు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు

== పలు అభివద్ది పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం

కూసుమంచి, నేలకొండపల్లి, సెప్టెంబర్ 22(విజయంన్యూస్)

ప్రతి ఇంటికి ప్రభుత్వం పథకాన్ని అందించామని, ఖమ్మం జిల్లాలో పథకం అందని ఇళ్లు ఉందా..? లేనేలేదని అని రాష్ట్ర రవాణా శాఖమంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఎంపీలు నామా నాగేశ్వరరావు, గాయత్రి రవి, ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డితో కలిసి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం నేలకొండపల్లి మండలంలో పర్యటించి పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవం, శంఖుస్థాపనలు చేశారు.

ALLSO READ- బతుకమ్మ ఆడిన మంత్రి పువ్వాడ

మంత్రి మండలంలోని ముజ్జుగూడెం గ్రామంలో రూ. 1.5 కోట్లతో నూతనంగా నిర్మించిన 33/11 కెవి సబ్ స్టేషన్ కు ప్రారంభోత్సవం చేశారు. అనంతరం పీఎంజిఎస్వై క్రింద సుమారు రూ. 1303.50 లక్షల అంచనా వ్యయంతో మంజూరైన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం కట్టు కాచారం నుండి తక్కెళ్లపాడు వరకు నిర్మించనున్న బిటి రహదారి పనులకు శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నిరంతర, నాణ్యమైన కరెంట్ ఇవ్వడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుందని అన్నారు. తెలంగాణ రాక పూర్వం 7800 మెగావాట్ల స్థాపిత విద్యుత్ ఉండేదని, ఇప్పుడు 17000 మెగావాట్ల స్థాపిత విద్యుతకు చేరామని ఆయన తెలిపారు. ఒకప్పుడు రైతులు కరెంట్ కొరకు అర్థరాత్రి పొలాల వద్దకు వెళ్లి పాముకాటు తదితర ప్రమాదానికి గురయ్యేవారని, ఇప్పుడు 24 గంటలు నాణ్యమైన ఉచిత కరంట్ ఇస్తున్నామని అన్నారు. పమ్మిలో 132 కెవి సబ్ స్టేషన్ నిర్మాణం పూర్తయితే ఈ ప్రాంతం విద్యుత్ వ్యవస్థ మొత్తం మెరుగవుతుందన్నారు. పంపిణీ వ్యవస్థను ప్రయివేటీకరణకు కేంద్రం చూస్తుందని ఆయన అన్నారు. విద్యుత్ సంస్థల ప్రయివేటుతో చాలా సమస్యలు వస్తాయని ఆయన తెలిపారు. విద్యుత్, సాగునీరు పుష్కలంగా ఉండడంతో పాలేరు క్రింద రెండు పంటలు పండుతున్నట్లు ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు రూ. 200 లు పెన్షన్ ఇవ్వగా, ఈ ప్రభుత్వం రూ. 2,016, వికలాంగులకు రూ. 3,016 ల చొప్పున ఆసరా పెన్షన్లు తెలంగాణలో 46 లక్షల మందికి అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

ALLSO READ- సూదిగాళ్లు ‘ఆ నలుగురే’ : ఏసీపీ     

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్, కేసీఆర్ కిట్, రైతుబంధు, రైతుభీమా వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. దేశంలో మరెక్కడా లేని పథకాలు రాష్ట్రంలో అమలుచేస్తున్నామన్నారు. కరంట్ చక్కగా చేసుకున్నాం, రహదారులను చక్కగా చేసుకుంటున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి ప్రభుత్వం పథకాల లబ్ది అందుతుందని, పధకం అందని ఇల్లు లేదని మంత్రి అన్నారు.

== పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చింది : నామా నాగేశ్వరరావు

కార్యక్రమాల్లో పాల్గొన్న ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులు, పల్లె ప్రజలు, పల్లెల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత నిచ్చి పథకాలు అమలు చేస్తుందని అన్నారు. దళితబంధు, రైతు బంధు, రైతు భీమా, ఆసరా పెన్షన్లు, కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి ఎన్నో పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. రాష్ట్ర నిధులు, ప్రాజెక్టులు, హక్కులకై కేంద్రంతో పోరాటం చేస్తున్నామన్నారు.

== ప్రజల సమస్యలన్నంటిని పరిష్కరిస్తా: ఎమ్మెల్యే కందాళ

పాలేరు నియోజకవర్గ ప్రజలందరి సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని, ప్రతి పల్లెటూరు, గ్రామాలను అభివద్ది చేసేందుకు తమవంతు ప్రయత్నం చేస్తామని పాలేరు ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి అన్నారు. ఎన్నికలు జరగబోయే లో గ్రామాల్లో సమస్యలు లేకుండా చేస్తామన్నారు. ఎమ్మెల్యే నిధులతో పాటు ఎంపీ నిధులు, ఎమ్మెల్సీ నిధులను ఉపయోగించి, అవసరమైతే మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నాయకత్వంలో ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులను తెప్పించి పాలేరు నియోజకవర్గంను అద్భుతంగా అభివద్ది చేస్తానని హామినిచ్చారు. ప్రజలందరు ఎవరికి సమస్య వచ్చిన తప్పకుండా పార్టీలకు అతీతంగా వచ్చి సమస్యను చెప్పాలని కోరారు.

ALLSO READ- జిల్లాకు బతుకమ్మ సారెలొచ్చాయి..

మద్యవర్తులు అవసరం లేదని, కూసుమంచిలోని క్యాంఫ్ కార్యాలయంకు వచ్చిన సమస్యను చెప్పుకుంటే తప్పకుండా పరిష్కరిస్తామన్నారు. నేను ఉన్నా, లేకున్నా మా పీఏ, నాయకులు ఉంటారని, వారి ద్వారా సమస్యను తెలుసుకుని కచ్చితంగా సమస్యను పరిష్కరించేందుకు కషిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం, జెడ్పి వైస్ చైర్మన్ ధనలక్ష్మి, విద్యుత్ ఎస్టె ఏ. సురేందర్, పీఆర్ ఇఇ శ్రీనివాస్ రావు, డిపివో హరిప్రసాద్, విద్యుత్ డిఇ లు ఎం. రామారావు, విసి. బాబూరావు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.