Telugu News

కూసుమంచిలో రాజీవ్ గాంధీకి మంత్రి పొంగులేటి ఘన నివాళి

నివాళ్ళు అర్పించిన ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు

0

కూసుమంచిలో రాజీవ్ గాంధీకి మంత్రి పొంగులేటి ఘన నివాళి

== నివాళ్ళు అర్పించిన ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి, నాయకులు

(కూసుమంచి-విజయం న్యూస్):

దివంగత ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని కూసుమంచిలో ఆయన విగ్రహానికి మంగళవారం పూలమాల వేసి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ అభ్యర్థి రఘురాంరెడ్డి నివాళులర్పించారు. పార్టీ శ్రేణులు జోహార్ రాజీవ్ అంటూ.. స్మరించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి మాట్లాడుతూ.. ఆనాడు ప్రధానిగా దేశాన్ని ఆర్థిక పథంలో నడిపించారని, సరికొత్త సంస్కరణలతో అభివృద్ధి వేగం పెంచారని అన్నారు. రాజీవ్ సేవలు మరువలేనివని, ప్రజలు ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఎండీ. హాఫీజుద్దిన్, ఎంపీపీ బానోతు శ్రీనివాస్, మాజీ ఎంపీపీ జూకూరి గోపాలరావు, నాయకులు బజ్జూరి వెంకటరెడ్డి, జొన్నలగడ్డ రవి, పెoడ్ర అంజయ్య, లింగారెడ్డి, రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.