Telugu News

తిరుమలాయపాలెం మండలంలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన

జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన దయాకర్ రెడ్డి 

0

తిరుమలాయపాలెం మండలంలో రేపు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన

== జయప్రదం చేయాలని పిలుపునిచ్చిన దయాకర్ రెడ్డి 

(తిరుమలాయపాలెం -విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

రాష్ట్ర రెవెన్యూ, హౌజింగ్, సమాచారం శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి శుక్రవారం పాలేరు నియోజకవర్గం లోని తిరుమలాయపాలెం మండలంలో పర్యటిస్తున్నట్లు మంత్రి కార్యాలయ ఇంచార్జ్ తుంబురు దయాకర్ రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సరికొత్త పంథా కు శ్రీకారం చుట్టారని తెలిపారు. క్యాంపు కార్యాలయానికి బాధితులను రప్పించుకునే అవసరం లేకుండా ఆయా గ్రామాలకు వెళ్ళి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకునేందుకు గ్రామాల్లో పర్యటించనున్నారని వివరించారు. కావున ప్రజలందరు అధిక సంఖ్యలో పాల్గొని ఈ పర్యటన విజయవంతం చేయగలరని కోరారు. తిరుమలాయపాలెం మండలంలో ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 6గంటల వరకు 20 గ్రామాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటిస్తారని, ప్రతి గ్రామంలో అర గంట సమయం ఉండి ప్రజల సమస్యలను తెలుసుకుంటారని తెలిపారు. పర్యటనలో భాగంగా మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారామ్, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం , ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని దయాకర్ రెడ్డి తెలిపారు.