Telugu News

ఇల్లెందు ఎమ్మెల్యే కోరం తండ్రికి మంత్రి పొంగులేటి నివాళి

ఎమ్మెల్యే ను ఓదార్చిన మంత్రి

0
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం తండ్రికి మంత్రి పొంగులేటి నివాళి
== ఎమ్మెల్యే ను ఓదార్చిన మంత్రి
(టేకులపల్లి-విజయం న్యూస్):
ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య తండ్రి కోరం పుల్లయ్య అనారోగ్యంతో గురువారం మృతి చెందారు. ఈ సమాచారం అందుకున్న రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురువారం  కోయగూడెం గ్రామానికి వెళ్లి మృతదేహాన్ని సందర్శించి ఆయన పార్థివ దేహానికి పూలమాలలు వేసి నివాలులర్పించారు. ఎమ్మెల్యే కోరంను ఓదార్చారు. ధైర్యంగా ఉండాలని కోరారు