Telugu News

నేడు ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

20గ్రామాల్లో పర్యటించనున్న మంత్రి 

0

నేడు ఖమ్మం రూరల్ మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

== 20గ్రామాల్లో పర్యటించనున్న మంత్రి 

(ఖమ్మం రూరల్-విజయం న్యూస్):

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఖమ్మం రూరల్ మండలంలో శనివారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మండలంలోని సత్యనారాయణపురం, ఎదులాపురం, గొల్లగూడెం, బారుగూడెం, కొండాపురం, తల్లంపాడు, పొన్నేకల్, మద్దులపల్లి, తెల్దారుపల్లి,గుర్రాలపాడు, వెంకటగిరి, గుదిమళ్ళ, నంద్యతండా, ఇందిరమ్మ కాలనీ , రాజీవ్ గృహకల్ప గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని దయాకర్ రెడ్డి తెలిపారు.