Telugu News

నేడు తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దయాకర్ రెడ్డి 

0

నేడు తిరుమలాయపాలెం మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన

== విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన దయాకర్ రెడ్డి 

(తిరుమలాయపాలెం-విజయం న్యూస్)

(రిపోర్టర్ -పెండ్ర అంజయ్య)

తెలంగాణ రెవెన్యూ, గృహనిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తిరుమలాయపాలెం మండలంలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయ ఇన్ చార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. పర్యటనలో భాగంగా మండలంలోని కొక్కిరేణి, ఎర్రగడ్డ, గోపాలపురం, తిమ్మక్కపేట, తాళ్లచెర్వు, బీరోలు, ఏలువారి గూడెం, బంధంపల్లి, బచ్చోడుతండా, సోలిపురం, రాజారామ్, పైనంపల్లి, జూపెడ, కాకరవాయి, సుద్దవాగుతండా, ముజాహిద్ పురం , ఏనుకుంట తండా, మంగళిబండతండా, రఘునాథపాలెం గ్రామాల్లో పర్యటిస్తారని పేర్కొన్నారు. ఆయా గ్రామాల్లోని ప్రజలు నేరుగా మంత్రిని కలిసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని దయాకర్ రెడ్డి తెలిపారు.*