Telugu News

ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావును హత్య చేసినోళ్లను వదిలేదిలేదు: పువ్వాడ

ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది

0

ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావును హత్య చేసినోళ్లను వదిలేదిలేదు: మంత్రులు

== ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుంటుంది

(ఖమ్మం-విజయంన్యూస్)

ఎఫ్ఆర్వో శ్రీనివాస్ రావును హత్య చేసినోళ్లను వదిలేదిలేదని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, అటవిశాఖ,దేవదాయశాఖామంత్రి ఇంద్రకర్ రెడ్డి స్పష్టం చేశారు. శ్రీనివాస్ రావు పై హత్య బాధాకరమని అన్నారు. వారేమన్నారో చూడండి

మంత్రులు పువ్వాడ, ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ..

దాడులను సహించేది లేదు. శ్రీనివాస రావు పై దాడి చేసి, దారుణంగా హత్య చేసిన ఎవరిని వదిలిపెట్టం.

ప్రభుత్వం ఈ ఘటనను చాలా సీరియస్ గా తీసుకుంది.

సీఎం కెసీఆర్ గారు వెంటనే స్పందించారు. అధికార లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని సీఎస్ ను ఆదేశించారు.

ఇది కూడా చదవండి: ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దారుణహత్య

ఇర్లపుడి వెళ్ళి FRO శ్రీనివాస రావు అంతిమ యాత్రలో పాల్గొనాలని మమ్మల్ని ఆదేశించారు.

సీఎం కేసీఅర్ ఆదేశాల మేరకు ప్రభుత్వము రూ. 50 లక్షల
ఎక్స్గ్రేషియా, కుటుంబంలో ఒకరికీ ప్రభుత్వ ఉద్యోగం, ఇతర బెనిఫిట్స్ కల్పిస్తూ జీవో జారీ చేసింది.

ఇక్కడి గిరిజనులతో సమస్య లేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అక్రమంగా వలస వచ్చిన గుత్తి కొయాలు అడవులను విచక్షణ రహితంగా నరికి వేస్తున్నారు.

అడవులను నరికినట్లు మా అటవీ అధికారులను కూడా నర్కుతం , దాడులు చేస్తాం అంటే ఊరుకునేది లేదు.

ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదు.

ఇది కూడా  చదవండి: అశ్రునయనాలతో శ్రీనివాసరావుకు అంతిమ వీడ్కోలు..