Telugu News

ప్రముఖ నటుడు కృష్ణ మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం

0

ప్రముఖ నటుడు కృష్ణ మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..

(ఖమ్మం-విజయం న్యూస్)

పద్మభూషణ్, సూపర్ స్టార్, మాజీ ఎం.పీ డాక్టర్. ఘట్టమనేని కృష్ణ మృతి పట్ల రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  సంతాపం వ్యక్తం చేశారు.

కృష్ణ మరణం తెలుగు సినిమా రంగానికి తీరని లోటని, తెలుగు సినిమా రంగంలో తీసుకు వచ్చిన మార్పులు మరువలేనివన్నారు.

ఇది కూడా చదవండి:- సూపర్ స్టార్ కృష్ణ అస్తమయం

కృష్ణ  ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్ధించారు.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.