బతుకమ్మల వద్ద డ్యాన్స్ వేసిన మంత్రి పువ్వాడ
== అంగరంగ వైభవంగా నానే బియ్యం బతుకమ్మ సంబరాలు
== బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మంత్రి పువ్వాడ దంపతులు
== హాజరైన ఎంపీ గాయత్రి రవి, ఎమ్మెల్సీ తాతామధు
ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 28(విజయంన్యూస్)
ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని 4వ రోజు నానే బియ్యం బతుకమ్మ వేడుకల సంబరాలు అంబరాన్ని అంటాయి.. కార్పోరేషన్ లోని 4, 21, 48, 50, & 58వ డివిజన్లలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ & టీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన బతుకమ్మ సంబరాలలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, సతీమణి పువ్వాడ వసంత లక్ష్మీ పాల్గొని మహిళలతో కలిసి కోలాటం ఆడారు. అనంతరం బతుకమ్మ సంబరాలలో భాగంగా ఆయా డివిజన్ లలో ఉత్తమ బతుకమ్మలను ఎంపిక చేసి వారికి “పువ్వాడ కానుక” లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ ఆడబిడ్డలందరు సుఖసంతోషాలతో, ఆటపాటలతో బతుకమ్మ వేడుకలను నిర్వహిస్తున్నారని, తెలంగాణ సంస్క్కితి, సంప్రదాయాన్ని కాపాడాల్సిన అవసరం ఎంతైన ఉందన్నారు. బతుకమ్మ వేడుకల్లో పాల్గొంటున్న మహిళలకు, చిన్నారులందరికి అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ, ఎంపి వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు, ఏఎంసీ చైర్మన్ లక్ష్మీ ప్రసన్న, కార్పొరేటర్లు దండా జ్యోతి రెడ్డి, ఆళ్ళ నిరీషా రెడ్డి, తోట గోవిందమ్మ, రాపర్తి శరత్, దొరెపల్లి శ్వేత తదితరులు అన్నారు.
allso read- కేసీఆర్ జాతీయ పార్టీకి ముహుర్తం పిక్స్..