పదికి పదే లక్ష్యంగా పనిచేద్దాం :మంత్రి పువ్వాడ
== ఖమ్మం జిల్లాలో భారీ చేరికలు తప్పవు
== ఐక్యంగా ముందుకు సాగాలి
== ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)
రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా, పదికి పది స్థానాలను కైవసం చేసుకునే విధంగా టీఆర్‌ఎస్ పార్టీ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజా ప్రతినిధులు ముందుకు సాగాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసిఆర్ మంగళవారం హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, నేతలతో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటీ సమావేశమై భవిష్యత్ కార్యాచరణ పై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా సమావేశం అనంతరం ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధులు, నియోజకవర్గ ఇంచార్జ్ లు, ముఖ్యనాయకులు రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ భేటి అయ్యారు. టీఆర్‌ఎస్ పార్టీ సంక్షేమ పాలనకు ఆకర్షితులై సీఎం కేసిఆర్ నాయకత్వాన్ని బలపరించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అతి త్వరలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ఇతర పార్టీలు నుంచి టీఆర్‌ఎస్ పార్టీలోకి చేరికలు భారీగా ఉంటాయని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ స్పష్టం చేశారు.
ఇది కూడ చదవంఢి : ప్రముఖ నటుడు కృష్ణ మృతి పట్ల మంత్రి పువ్వాడ సంతాపం..
ప్రజలకు, పార్టీ శ్రేణులకు నేతలందరూ నిత్యం అందుబాటులో ఉండాలని, పార్టీ గెలుపే లక్ష్యంగా ఓటర్లను చైతన్య పరచాలని మంత్రి సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకమై చేయాలని ఈ సందర్భంగా నేతలను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ సూచించారు. ప్రతి ఒక్కరు ప్రజల్లో ఉండాలని, కార్యకర్తలకు అందుబాటులో ఉండాలని, వివాదాలకు దూరంగా ఉండాలని సూచించారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో అమలైన పథకాల గురించి ప్రజలకు అవగాహణ కల్పించాలని అదేశించారు. పార్టీ తరుపున ప్రజలకు ఏలాంటి పథకాలను అందిస్తిందో ప్రజలకు తెలిసే విధంగా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. పెండింగ్ లో ఉన్న పనులను పూర్తి చేయాలని, అభివద్దికి సంబంధించిన వర్కులకు తక్షణమే శంకుస్థపానలు చేయాలని, పనులు కావాల్సి ఉంటే సీఎంకు లేఖ ద్వారా వివరించాలని సూచించారు. ప్రజలకు మెరుగైన అభివద్ది, సంక్షేమ పలాలను అందించాలని సూచించారు. పార్టీలోకి వచ్చే వారిని ఆహ్వానించాలని అన్నారు. మరో ఏడాది సమయం ఉన్నందున ప్రజల్లోకి వెళ్లి వారితోనే ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఖమ్మం ఎంపీ, పార్లమెంటరీ పార్టీ నేత నామ నాగేశ్వరరావు, జిల్లా పార్టీ ఇంచార్జ్ నూకల నరేష్ రెడ్డి, ఎమ్మెల్యేలు సండ్ర వెంకటవీరయ్య, రాములు నాయక్, కందాళ ఉపేందర్ రెడ్డి, మెచ్చా నాగేశ్వరరావు, రేగా కాంతారావు, ఎమ్మెల్సీ తాతామధుసూదన్, రాజ్యసభ సభ్యులు గాయత్రి రవి, భద్రాచలం ఇంచార్జ్ తెల్లం వెంకట్రావ్ హాజరైయ్యారు.
ఇది కూడ చదవండి: దివికేగిన బుర్రిపాలెం బుల్లోడు