Telugu News

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం: మంత్రి పువ్వాడ

మంజూరైన కొత్త పింఛన్లను ధృవపత్రాలను పంపిణి చేసిన మంత్రి

0

అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యం: మంత్రి పువ్వాడ

★★ మంజూరైన కొత్త పింఛన్లను ధృవపత్రాలను పంపిణి చేసిన మంత్రి

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తున్నదని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్  అన్నారు.

ఖమ్మం నియోజకవర్గంకు కొత్తగా మంజూరైన పింఛన్‌ ధ్రువపత్రాలను సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక లో లబ్దిదారులకు మంత్రి పువ్వాడ పంపిణీ చేశారు.

ఇది కూడ చదవండి:- తెలుగు భాషా దినోత్సవం మనందరి భాష దినోత్సవం: మంత్రి పువ్వాడ అజయ్

57 సంవత్సరాలు పూర్తి అయిన వృద్దులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెన్షన్ ఇవ్వాలనే నిర్ణయం మేరకు రాష్ట్ర వ్యాప్త పంపిణీలో భాగంగా సోమవారం ఖమ్మం లో జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్, మేయర్ పునుకొల్లు నీరజ గరితో కలిసి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ లాంఛనంగా ప్రారంభించారు.

అనంతరం ఖమ్మం కార్పొరేషన్ పాండురంగపురం ZPHS ప్రభుత్వ పాఠశాల అవరణంలో 2, 3 4, 5 & 6 డివిజన్‌ల లబ్ధిదారులకు పెన్షన్ గుర్తింపు కార్డ్స్ ను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హాయంలో రూ.200 ఇవ్వడానికే తీవ్ర ఇబ్బంది పడిన ఘటనల నుండి నేడు రూ.3వేల వరకు పెన్షన్ లు ఇవ్వడం తెలంగాణ ప్రభుత్వంకే సాధ్యమైంది అన్నారు.

ఇది కూడ చదవండి:- బిజెపి నేతలు చర్య దుర్మార్గమైనది: మంత్రి పువ్వాడ

రాష్ట్ర వ్యాప్తంగా 57 సంవత్సరాలు నిండిన పేదలందరికీ10 లక్షల మందికి రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ఆసరా పింఛన్లు అందిస్తుందన్నారు.

ఖమ్మంలో ప్రస్తుత 1.50 లక్షలు ఇస్తుండగా అదనంగా నేడు 49 వేల కొత్త పెన్షన్ లు ఇవ్వటం గర్వకారణమన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌ గారికే దక్కిందన్నారు.

డయాలసిస్ రోగులకు ఉచితంగా వైద్యం అందించడంతో పాటు వారికి కూడా పెన్షన్ ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఅర్  నిర్ణయం తీసుకోవడం పట్ల స్వాగతిస్తున్నామని అన్నారు.

రాష్ట్రంలో ఎక్కడ ఎలాంటి సంక్షేమం అగలేదని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలు కేవలం దుష్ప్రచారం చేసి తమ పబ్బం గడుపుకోవడనికి విశ్వ ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.