Telugu News

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

విద్యను బలోపేతం చేస్తాం

0

విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, యూనిఫాం పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

★★ విద్యను బలోపేతం చేస్తాం

ఖమ్మంప్రతినిధి, ఆగస్టు3(విజయం న్యూస్)

రాష్ట్ర ప్రభుత్వం విద్యను బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని, అందులో భాగంగా ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.

బుధవారం ఖమ్మం కార్పోరేషన్ వెలుగుమట్ల కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో ప్రభుత్వం అందిస్తున్న ఉచిత ద్విభాషా(ఇంగ్లీష్ & తెలుగు) పాఠ్యపుస్తకాలు, యూనిఫాం ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ విద్యార్థినిలకు పంపిణి చేశారు.

Allso read:- ఇంటి మీద బెంగతో గూడ దూకిన విద్యార్థిని.. ఏమందంటే..?

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..

మంచి బోధనకు చిరునామా ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయని అన్నారు.

ఉన్నత లక్ష్యాలను చేరుకోవాలి అంటే మంచిగా చదువుకోవాలి, స్వశక్తితో ఎదగాలని ఆకాంక్షించారు.

ఇప్పుడు చదువుకునే విద్య మాత్రమే ఫౌండేషన్ గా నిలబడుతుంది అని, జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే విద్య మాత్రమే మనలను అనుకున్న లక్ష్యం వైపుకు చేర్చుతుంది అని అన్నారు.

మొత్తం 364 మంది విద్యార్ధినిలకు యూనిఫాం, పాఠ్యపుస్తకాలు పంపిణి చేశారు. అనంతరం విద్యార్థులతో ముచ్చటించారు. భోజనం, అల్పాహారం సరిగ్గా అందుతుందా అని వివరాలు అడిగి తెలుసుకున్నారు.