గోదావరి వరదలపై గళమెత్తిన మంత్రి
== దేవుడు వలె ప్రజలను సీఎం కేసిఆర్ రక్షించారు
== సీడబ్ల్యూసీ సరైన అధ్యయనం చేయాలని మంత్రి డిమాండ్
ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 7(విజయంన్యూస్)
భద్రాచలం వద్ద గోదావరి వరద పరిస్థితులను వివరిస్తూ పోలవరం ప్రాజెక్టు వల్ల పొంచి ఉన్న ముప్పుపై, కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ అసెంబ్లీలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గళమెత్తారు. మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ గత చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వరదలు వచ్చాయని ఈ నేపథ్యంలో సీఎం కేసిఆర్ దేవుడు వలె ప్రజలను రక్షించే ప్రయత్నం చేసి ఒక్క ప్రాణం పోకుండా చర్యలు తీసుకున్నారని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వరదలను అంచనా వేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు.
allso read- ఆశయమా… ఆత్మరక్షణా..
టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ముందస్తుగా వరదలపై అప్రమత్తం చేయలేదని పేర్కొన్నారు. ఎత్తు తగ్గించాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉందని మంత్రి పేర్కొన్నారు. వరదల నివారణకు ఆ ప్రాజెక్టు ఎత్తు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలన్నారు. 1986లో వరదలకంటే ఈసారి తక్కువగానే వచ్చాయని, అయి నా ముంపు ఎక్కువగా ఉండటానికి పోలవరమే కారణమని అన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని గతంలోనే తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరిందని గుర్తు చేశారు. సీడబ్ల్యూసీ, గోదావరి నదీ యాజమాన్య బోర్డులు వరదలను అంచనా వేయడంలో విఫలమయ్యాయని ఆరోపించారు. టెక్నాలజీ ఎంతగానో అభివృద్ధి చెందినప్పటికీ ముందస్తుగా వరదలపై అప్రమత్తం చేయలేదని పేర్కొన్నారు. పోలవరం బ్యాక్ వాటర్‌తో పంట నష్టంతో పాటు చారిత్రాత్మక ప్రాంతాలకు ముప్పు ఉందని తెలిపారు. భద్రాచలం, పర్ణశాల కూడా మునిగిపోతాయని చెప్పారు. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలో స్టడీ చేసేందుకు కేంద్రానికి ఎన్నోసార్లు లేఖలు రాశామని తెలిపారు. బ్యాక్ వాటర్ నష్టం, ఇతరత్రా అంశాలపై కేంద్రం ఇప్పటికీ స్పందించలేదని పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాలని మొదటి నుంచి తాము డిమాండ్ చేస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరో గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ఉన్న ముప్పును నివారించాలని డిమాండ్ చేశారు. ఏపీ నుంచి కూడా ముంపు భాదితులు వచ్చి తమ పునరావాస శిబిరాల్లో తలదాచుకున్నారని గుర్తు చేశారు. ముఖ్యంగా భద్రాచలం పక్కనే ఉన్న 5 గ్రామాలను తెలంగాణలో కలపాలి. ఆ ఐదు గ్రామాల అంశంపై కేంద్రం ఆలోచించాలని మంత్రి పువ్వాడ అజయ్ సూచించారు.
allso read- పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా
భద్రాచలం ప్రాంతంలో వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు వెయ్యి కోట్లు కేటాయిస్తున్నట్టు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారని ఈ మొత్తంతో వరద బాధితులకు శాశ్వత ప్రాతిపదికన నివాస కాలనీల నిర్మాణాలు, భద్రాద్రి సీతారాముల దేవస్థానం చుట్టూ కరకట్ట అభివృద్ధి, బూర్గంపాడు వైపు ఉన్న కరకట్ట మరమ్మతులతోపాటు, ముంపు సమస్యలు పరిష్కరిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ చెప్పారు. భద్రాచలంలో ముంపు శాశ్వతంగా సమస్యను పరిషరించాలని నిర్ణయించామన్నారు. భద్రాచలం పట్టణ కాంటూరు లెవల్స్‌ను పరిగణనలోకి తీసుకొని వరద బాధితులకు ఎత్తైన ప్రదేశాల్లో కాలనీల నిర్మాణం చేపట్టాలని సీఎం కేసిఆర్ సూచించారన్నారు. భద్రాచలం, బూర్గంపాడు, పినపాక నియోజకవర్గాల్లో వరద సమస్యలు వచ్చాయని 25 వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించామని పరిస్థితులు చక్కదిద్దుకొన్న తర్వాతే వారిని తిరిగి పంపించామని గుర్తు చేశారు. బాధిత కుటుంబాలు ఒక్కింటికి 20 కిలోల చొప్పున 2 నెలలపాటు ఉచితంగా బియ్యం రూ.10 వేల తక్షణ ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. క్యాబినేట్ సమావేశంలో సీఎం కేసీఆర్ వరద ముంపునకు గురైన 2,016కుటుంబాలకు రూ.వెయ్యి కోట్లతో ఎత్తైన ప్రదేశంలో కాలనీలు నిర్మిస్తామని తీర్మానం చేశారన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో గోదావరి వరదలు వస్తే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమైందని అన్నారు. యంత్రాంగం కూడా యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టిన ప్రాణనష్టం జరుగకుండా చూసిందన్నారు.
allso read- గల్లీ (కో ) బెల్ట్ దుకాణం…