Telugu News

మంత్రి పువ్వాడ చే టీఎస్ మేసా క్యాలెండర్ ఆవిష్కరణ.

ఖమ్మం విజయం న్యూస్

0

మంత్రి పువ్వాడ చే టీఎస్ మేసా క్యాలెండర్ ఆవిష్కరణ.

(ఖమ్మం విజయం న్యూస్):-

తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ (టిఎస్ మే సా ) ఆధ్వర్యంలో రూపొందించిన 20 22 నూతన సంవత్సరం క్యాలెండర్ ను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గురువారం తన గృహంలో ఆవిష్కరించారు. టిఎస్ మే సా గౌరవ అధ్యక్షుడు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు ఎండి అఫ్జల్ హసన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ టీఎస్ మే సా ఆధ్వర్యంలో ఈ క్యాలెండర్ను ఆవిష్కరించడం ఆనందంగా ఉందన్నారు.

also read;-సకల సదుపాయలతో కార్పొరేషన్ కార్యాలయం : మంత్రి పువ్వాడ

మేసా  తమ ప్రభుత్వం అండదండగా ఉంటుందని హామీ ఇచ్చారు. క్యాలెండర్ ఆవిష్కరణ మహోత్సవ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనారిటీ ఎంప్లాయిస్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండి. రజ్జబ్ అలీ,ప్రధాన కార్యదర్శి హసన్ పాష ,కోశాధికారి సయ్యద్ రహీం , అసోసియేషన్ ప్రెసిడెంట్ సయ్యద్ హాబిబ్ , వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం డి.హాకీ మ్ , వైస్ ప్రెసిడెంట్ సయ్యద్ మూర్తుజా హుస్సేన్ , అయుబ్ ఖాన్, ఇనాయత్, అఫ్జల్ పా ష ,జానీ , సలీమ్, యాకూబ్ పాష , మన్నన్ తది తరులు పాల్గొన్నారు.