***నిత్యశ్రీ ని అభినందించిన మంత్రి పువ్వాడ..
***(ఖమ్మం విజయం న్యూస్):-
ఖమ్మం నగరానికి చెందిన నోముల శ్రీనివాస్ లావణ్య దంపతుల కుమార్తె నిత్యశ్రీ ని తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అభినందించారు.అంతర్జాతీయ, జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలో తనకున్న ప్రతిభాతో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో మరియు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ పేరు సంపాదించడం అభినందనీయమని అన్నారు.
also read :-***సీఎం కేసీఆర్ పుట్టినరోజు.. పండుగ రోజు
భగవద్గీత శ్లోకాలు, హనుమాన్ చాలీసా పూర్తిగా పారాయణం చేయటం మరియు తెలుగు సంవత్సరాలు 21 సెకన్లలో చెప్పేయడం, వివిధ దేశాలు వాటి రాజధానులు మరియు కరెన్సీని అతితక్కువ సమయంలో చెప్పడం ఇలాంటి అసాధ్యమైన వాటిని సుసాధ్యం చేసి సరస్వతి కటాక్షంతో అందరి మన్ననలు పొందిన పట్ల నిత్యశ్రీ ని పలువురు అభినందించారు.రానున్న భవిష్యత్ కాలంలో నిత్యశ్రి విద్యా రంగంలో మరింత రాణించాలని మంత్రిపువ్వాడ ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు RJC కృష్ణ, SUDA చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, నగర్ టిఆర్ఎస్ అధ్యక్షులు పగడాల నాగరాజు, నాయకులు కన్నం ప్రసన్న కృష్ణ, జశ్వంత్ తదితరులు ఉన్నారు.