Telugu News

★ ప్రధాని మోదీ వ్యాఖ్యలుపై మంత్రి పువ్వాడ ఫైర్..

★ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలకు మంత్రి పిలుపు

0

★ ప్రధాని మోదీ వ్యాఖ్యలుపై మంత్రి పువ్వాడ ఫైర్..

★ ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా నిరసనలకు మంత్రి పిలుపు

పార్లమెంట్‌ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, విభజన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీశాయని వెంటనే క్షమాపణ చెప్పాలని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణకు సీఎం కేసీఆర్‌ బంధువైతే, మోదీ రాబంధువలా తయారయ్యాడని విమర్శించారు. తెలంగాణ ఇచ్చిన పార్లమెంట్‌నే, సంతకం పెట్టిన రాష్ట్రపతిని మోదీ అవమానించారని ఆరోపించారు. తెలంగాణ వ్యతిరేక డీఎన్‌ఏ తనలో ఉందని ప్రధాని నిరూపించుకున్నారని, బీజేపీ నేతలు తెలంగాణలో ఇక ఏం మొహం పెట్టుకొని తిరుగుతారని ప్రశ్నించారు.

★ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నిరసనలకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపు

పార్లమెంట్ వేదికగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విభజన తీరుపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన అసంబద్ధ వ్యాఖ్యలకు నిరసనగా తెరాస అధినేత సీఎం కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రధాని మోదీ, బీజేపీ పార్టీ దిష్టి బొమ్మ దహనం చేస్తూ నిరసన కార్యక్రమాలు చేపట్టాలని తెరాస శ్రేణులకు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. జిల్లా, మండల కేంద్రాల్లో నల్ల జెండాలు ప్రదర్శిస్తూ తెలంగాణ పట్ల ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వ వివక్షపై నిరసన ప్రదర్శన చేపట్టాలని మంత్రి పువ్వాడ కోరారు.