Telugu News

మహాత్ముడిని కొనియాడిన మంత్రి పువ్వాడ

మహాత్ముడి ఆశయ సాధన కోసం మనమంతా కదలాలి

0

మహాత్ముడిని కొనియాడిన మంత్రి పువ్వాడ

==  అందరికీ ఆదర్శప్రాయులు మహాత్మా గాంధీ

== విధ్వేషం, విభజన, వివాదాలకు స్వస్థి పలకాలి

==  శాంతియుత శకానికి నాంది పలకాలి

== మహాత్ముడి ఆశయ సాధన కోసం మనమంతా కదలాలి

== రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మంప్రతినిధి, అక్టోబర్ 1(విజయంన్యూస్)

కొందరు రాజకీయ స్వార్థం కోసం జాతిపితా, అందరికి ఆదర్శప్రాయుడైన మహాత్మగాంధీని కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని, అలాంటి సంఘటనలు వచ్చినప్పుడు అందరం ఐక్యంగా ఉండి వాటిని తిప్పికొట్టాల్సిన అవసరం ఎంతైన ఉందని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పిలుపునిచ్చారు.

ALLSO READ- వెంచర్ వేయాలంటే లేఆవుట్ అనుమతి కావాల్సిందే: కలెక్టర్ 

ప్రార్థన, అభ్యర్థన, నిరసన అనే ఆయుధాలతో ప్రపంచానికి సరికొత్త పోరాట మార్గాన్ని చూపిన జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శప్రాయుడని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ అన్నారు. మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా మంత్రి అజయ్ ఆయనకు నివాళి అర్పించారు. మహాత్మా గాంధీ అహింస, సత్యాగ్రహదీక్షల ద్వారా స్వాతంత్ర్య సంగ్రామాన్ని ఉరకలెత్తించారని మంత్రి కీర్తించారు. ఎప్పటికైనా సత్యానిదే అంతిమ విజయమని మహాత్మాగాంధీ జీవితం చాటి చెప్తుందని విశ్వాసం, సహనంతో కూడిన నవ శకానికి నాంది పలికేందుకు మహాత్ముని శాంతి సందేశాన్ని ప్రతిఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు. మహాత్ముడిలా మనం కూడా సమాజాన్ని విడదీసే అంశాలపై కాకుండా ఏకం చేసే విషయాలపై దృష్టిసారించాలని మంత్రి పేర్కొన్నారు.

గాంధీజీ స్వతంత్ర సముపార్జన సారథి మాత్రమే కాదని యావత్‌ ప్రపంచానికే అహింసా సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాంతి దూత, విశ్వ మానవుడని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో విశ్వమానవుడైన మహాత్ముడిని కించపరిచే వ్యాఖ్యలు వింటుండటం దురదృష్టం అని వారిని కించపరిచే ఘటనలు వాంఛనీయం కాదన్నారు. విధ్వేషం, విభజన, వివాదాలకు స్వస్థి పలికి శాంతియుత శకానికి నాంది పలకాలి అని మంత్రి అజయ్‌కుమార్‌ కోరారు.

ఇది కూడా చదవండి: మహా నగరాలకు దీటుగా ఖమ్మం అభివృద్ధి చేస్తాం : మంత్రి పువ్వాడ

ప్రపంచంలో ఏ జాతి కూడా తన చరిత్రను తానే మలినం చేసుకోదని అటువంటి వెకిలి, మకిలి ప్రయత్నాలు ఎక్కడ వచ్చినా అందరూ ఏకోన్ముఖంగా ఖండించాలని స్పష్టం చేశారు. అటువంటి మహాత్ముడికి ఏ పరిస్థితుల్లో కూడా కళంకం రాకుండా చూడాలని ఎన్నో ప్రయాసలు, ఎన్నో ప్రయత్నాలు, ఎన్నో కష్టాలకు ఓర్చి ఈనాడు మనం అనుభవిస్తున్న భారతదేశం మనకు అందించబడింది అని మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ వ్యాఖ్యానించారు.