కొండా లక్ష్మణ్ బాపూజీ సేవలు స్ఫూర్తిదాయకం : మంత్రి పువ్వాడ అజయ్
== ఆయన ఆశయ సాధన కోసం మనమంతా పనిచేయాలి
ఖమ్మంప్రతినిధి, సెప్టెంబర్ 26(విజయంన్యూస్)
భారత స్వాతంత్య్రోద్యమం, తెలంగాణ రైతాంగ పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ పోషించిన పాత్ర మరువలేనిదని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి ( సెప్టెంబర్ 27) సందర్భంగా ఆయనను మంత్రి అజయ్ స్మరించుకున్నారు.
ఇది కూడా చదవండి: రవాణా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి పువ్వాడ
తెలంగాణ తొలితరం పోరాటయోధుడని, ఆఖరి శ్వాస వరకు తెలంగాణకై పారాడిన కొండా లక్షణ్ బాపూజీ స్మరించుకోవడమంటే తెలంగాణ ఉద్యమాన్ని గుర్తు చేసుకోవడమేనని చెప్పారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత గొప్ప నాయకులను, గొప్ప వ్యక్తులను వారి త్యాగాలను స్మరించుకోవాలని, వారి జయంతులను సీఎం కేసిఆర్ సారథ్యంలోని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని మంత్రి అజయ్ తెలిపారు.
పీడిత ప్రజల విముక్తి కోసం బహుముఖ పోరాటం చేసిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ నేటి తరం యువతకు ఆదర్శమన్నారు. ప్రజల పట్ల నిబద్దత, కార్యదక్షతతో, నిజాయితీగా రాజకీయాల్లో రాణించారని, హుందాగా వ్యవహరించారని, నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయులని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కొనియాడారు.
ఇది కూడ చదవండి : – తెలంగాణ బహుజన వర్గాల స్ఫూర్తి దాత ఐలమ్మ : మంత్రి పువ్వాడ అజయ్ కుమార్