Telugu News

గంగపుత్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..

ఖమ్మం నగర గంగపుత్ర బెస్త సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం-2022 క్యాలెండర్ ను రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.

0

గంగపుత్ర సంఘం క్యాలెండర్ ఆవిష్కరించిన మంత్రి పువ్వాడ..

 

(ఖమ్మం – విజయంన్యూస్)

ఖమ్మం నగర గంగపుత్ర బెస్త సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సరం-2022 క్యాలెండర్ ను రాష్ట్ర రవాణా శాఖ మాత్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గంగపుత్రులకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందని చేప పిల్లల పంపిణీ, చెరువులు, కుంటల సుందరీకరణ మరియు ఇతర సంక్షేమ కార్యక్రమాల ద్వారా బడుగు బలహీన వర్గాలకు బాసటగా కెసిఆర్ గారు జనరంజక పాలన కొనసాగిస్తున్నారని తెలిపారు.

రానున్న కాలంలో ఖమ్మం నగరంలో గంగపుత్రులు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపట్టాలని ఐక్యంగా మెలగాలని వారు కోరారు.

కార్యక్రమంలో కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, మాజీ కౌన్సిలర్ వంగాల వెంకట్, నగర అధ్యక్షులు గుంటి సత్యనారాయణ కార్యదర్శి సింగు శ్రీనివాస్ కోశాధికారి నరుగుల రవికుమార్, జిల్లా అధ్యక్షులు పాకాల ఉపేందర్, ప్రధాన కార్యదర్శి దేశబోయిన మంగారావు, సంఘం నాయకులు మైసా పాపారావు, దేశబోయిన తిరుపతయ్య, చింతల మల్లేశం, పెద్దపల్లి సోమయ్య, పిల్లి సుదర్శన్, చేతి కృష్ణ, గోధుమల శ్రీనివాసరావు, గుంటి కుమార స్వామి, సోమనబోయిన సత్యం, డోలి లక్ష్మీనారాయణ, రాసకచ్చుల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

 

also read :- కళామందిర్ షోరూం ను ప్రారంభించిన మంత్రి పువ్వాడ..

also read :-రామచంద్రయ్య నగర్లో నివాసాలు కోల్పోయిన వారిని  తక్షణమే ఆదుకోవాలి : వాసుదేవరావు