Telugu News

జిల్లాల పార్టీ నూతన అధ్యక్షులకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు

Minister Puvada wishes the new presidents of the districts party

0

జిల్లాల పార్టీ నూతన అధ్యక్షులకు మంత్రి పువ్వాడ శుభాకాంక్షలు
★ తిరుగులేని రాజకీయశక్తిగా టీఆర్ఎస్
(ఖమ్మం ప్రతినిధి  -విజయంన్యూస్)
తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, సీఎం కెసిఆర్ నియమించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ శుభాకాంక్షలు తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ తాతా మధు, ఎమ్మెల్యే రేగా కాంతారావులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.నూతనంగా నియమితులైన పార్టీ జిల్లాల అధ్యక్షులు పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ, సీఎం కెసిఆర్ వాళ్లపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేయాలని సూచించారు. పార్టీ కి, పార్టీ శ్రేణులకు, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య అనుసంధానంగా జిల్లాల పార్టీ అధ్యక్షులు పని చేయాలని ఆకాంక్షించారు.

also read :- నాడు అక్రమము నేడు సక్రమం

పార్టీని బలోపేతం చేస్తూ, పార్టీ కార్యక్రమాలతో పాటు, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేయాలని కోరారు. సిఎం కేసిఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల కోసం దేశంలో ఎక్కడా లేనివిధంగా అమలు జరుగుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సమితి అంటే తిరుగులేని రాజకీయ శక్తి అని, దేశంలోనే ఇంతగా కార్యకర్తల బలమున్న పార్టీ దేశంలోనే లేదన్నారు టిఆర్ఎస్ లో ఉండటం ఒక గౌరవం, ఒక బలం, బలగం అని మంత్రి అన్నారు. పార్టీ గౌరవాన్ని, సీఎం కెసిఆర్ గారి నమ్మకాన్ని మరింత పెంచే విధంగా పని చేయాలని మంత్రి పువ్వాడ పార్టీ జిల్లాల నూతన అధ్యక్షులకు సూచించారు.

also read :- ఈనెల 28న ‘స్టేట్ పోలీస్ అండ్ ఎక్సైజ్ కాన్ఫరెన్స్’´