Telugu News

తెలంగాణ రైతుల‌పై బీజేపీ ప‌గ‌ : మంత్రి పువ్వాడ.

★ మంత్రి పువ్వాడ అజయ్ ధ్వ‌జం

0

తెలంగాణ రైతుల‌పై బీజేపీ ప‌గ‌ : మంత్రి పువ్వాడ

★ మంత్రి పువ్వాడ అజయ్ ధ్వ‌జం

రైతుల ఓట్లు కావాలి కానీ అదే రైతు పండించిన వ‌డ్ల‌ను మాత్రం కొన‌రా? అని కేంద్ర బీజేపీ ప్రభుత్వాన్ని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్ర‌శ్నించారు. తెలంగాణ మంత్రులు 70లక్షల మంది రైతులు, నాలుగు కోట్ల మంది ప్రజల తరఫున ఢిల్లీకి వెళ్తే వారిని కేంద్రమంత్రి పీయూష్ గోయల్ మీకేం పని లేదా? అని అవమానకరంగా వ్యాఖ్యానించడం యావత్‌ తెలంగాణ ప్రజానీకాన్ని, 70లక్షల రైతు కుటుంబాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనన్నారు వెంటనే కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకొని, భేషరతుగా క్షమాపణలు చెప్పాలని మంత్రి అజయ్ డిమాండ్‌ చేశారు.

తెలంగాణ రైతుల‌కు అన్యాయం జ‌రుగుతుంటే.. తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు మౌనంగా ఉండ‌టం ఎంత వ‌ర‌కు స‌మంజ‌సం అని ప్ర‌శ్నించారు. తెలంగాణ ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అభాసుపాలు చేయడానికి ప్రయత్నం చేస్తుందని ఆయన ఆరోపించారు.

తెలంగాణ కాంగ్రెస్ కు చెందిన ముగ్గురు ఎంపీలు ధాన్యం కొనుగోలు విషయంపై ఒక్కసారి కూడా కేంద్రాన్ని ప్రశ్నించకపోవడం విడ్డూరంగా ఉందని మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో రైతులు ఆందోళన చెందుతుంటే కాంగ్రెస్ వాళ్లు ఎక్కడ కూడా ఆ విషయంపై స్పందించకుండా టీఆర్ఎస్‌ను నిందించటమే పనిగా పెట్టుకున్నారని మంత్రి పువ్వాడ విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ పుట్టుక తెలంగాణ జాతి, ప్రయోజనాల కోసమన్నారు అనేక త్యాగాల పునాదుల మీద రాష్ట్రాన్ని సాధించామని, రాష్ట్రం రైతుల ప్రయోజనాల కంటే మాకేం ముఖ్యముంటుందని.. అందుకు ఢిల్లీకి వచ్చారన్నారు. మీకు (కేంద్రం) మాత్రం రాజకీయాలే ముఖ్యమన్నారు మాట తప్పింది, మాట మార్చింది.. రాజకీయం చేస్తూనే తమపై నిందలు వేస్తున్నారన్నారు.

ALSO READ;-పేదల నడ్డి.. విరుస్తున్న వారాల వడ్డీ ..!