ఖమ్మం మున్సిపల్ కమిషనర్ గా నియమితులైన Adarsh Surabhi IAS గారు మంగళవారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన మున్సిపల్ కమీషనర్ Adarsh Surabhi IAS గారిని శాలువ కప్పి స్వాగతం పలికారు.
ఖమ్మం నగరం మరింత అభివృద్ధికి కృషి చేయాలన్నారు. కార్పొరేషన్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని త్వరగా పూర్తి అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని సూచించారు.
వారి వెంట మేయర్ నీరజ గారు, సూడా చైర్మన్ విజయ్ కుమార్ గారు ఉన్నారు.