Telugu News

ఐలమ్మపై మంత్రి పువ్వాడ అసక్తికర కామెంట్స్

చాకలి ఐలమ్మ తెగువ తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక అన్న మంత్రి

0

చాకలి ఐలమ్మ తెగువ తెలంగాణ మహిళా చైతన్యానికి ప్రతీక

–ఐలమ్మను కొనియాడిన మంత్రి పువ్వాడ

— ఖమ్మంలో ఘనంగా ఐలమ్మ జయంతి వేడుకలు 

(ఖమ్మం ప్రతినిధి-విజయంన్యూస్)

మాటల్ని తూటాలుగా మలిచి.. దోపిడిదారుల గుండెల్లో ఫిరంగిగా పేలిన తెలంగాణ రైతాంగ విప్లవాగ్ని చాకలి ఐలమ్మ జీవితం భవిష్యత్ తరాలకు స్పూర్తిదాయకమైందని, తెలంగాణ తెగువకు నిదర్శనమని, మహిళా చైతన్యానికి ప్రతీక అని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గారు పేర్కొన్నారు. ఆదివారం చాకలి ఐలమ్మ 126వ జయంతి సందర్భంగా ఖమ్మం కాలెక్టరేట్ వద్ద ఐలమ్మ గారి విగ్రహానికి మంత్రి పువ్వాడ పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, సబ్బండ వర్గాల ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి ప్రతీకగా నిలిచిన, చిట్యాల (చాకలి) ఐలమ్మ 126 వ జయంతి సందర్భంగా మంత్రి ఘన నివాళులు అర్పించారు.ఆమె జయంతి, వర్థంతిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం ఆమె చేసిన పోరాటానికి నిజమైన నివాళి అని అన్నారు.తెలంగాణ మట్టిలోనే పోరాటం ఉందని, అందుకు చాకలి ఐలమ్మ జీవితం గొప్ప సందేశమన్నారు. తెలంగాణ ఉద్యమ కారులను, తెలంగాణ పోరాట యోధులను ముఖ్యమంత్రి కేసిఆర్ గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం గొప్పగా గౌరవించుకుంటుందని వివరించారు.చాకలి ఐలమ్మ గారి స్ఫూర్తితోనే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నదని మంత్రి పువ్వాడ అన్నారు. అన్ని వర్గాల అభ్యున్నతే ధ్యేయంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు అనేక పథకాలకు రూపకల్పన చేశారని చెప్పారు.రజకులు, నాయీబ్రాహ్మణుల ఆర్థిక స్వావలంబన, జీవన ప్రమాణాల పెంపుకోసం ప్రతిపాదించిన దోబీఘాట్లు, లాండ్రీలు, సెలూన్లకు 250 యూనిట్ల ఉచిత కరెంటు ఇస్తున్నట్లు వెల్లడించారు.

ఖమ్మంలో ఇప్పటికే దాదాపు వెయ్యి మందికి ఉచిత విద్యుత్ కనెక్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు.బడుగు బలహీనవర్గాల అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ గారు నిరంతరం పరితపిస్తారని పేర్కొన్నారు.ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తిని స్మరించుకున్నారని, అత్యంత వెనకబడిన కులం (ఎంబీసీ)లో జన్మించిన ఐలమ్మ తెలంగాణ బహుజన వర్గాల స్పూర్తి ప్రదాతగా నిలిచిందన్నారు.సాయుధ పోరాట కాలంలోనే తన హక్కుల సాధన కోసం, చట్టం పరిధిలో, కోర్టుల్లో న్యాయం కోసం కొట్లాడిన గొప్ప ప్రజాస్వామికవాది చిట్యాల ఐలమ్మ అని కొనియాడారు.తెలంగాణ రాష్ట్ర సాధనలో ఐలమ్మ ప్రజాస్వామిక పోరాట స్పూర్తి ఇమిడి వున్నదన్నారు.

also read : తహసీల్దార్ ఆఫీస్ లో ఏడ్చిన మహిళ

చిట్యాల ఐలమ్మ జయంతి, వర్థంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్నదని, భావితరాలు గుర్తుంచుకునే విధంగా ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మేయర్ పునుకొల్లు నీరజ , ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్,, రాష్ట్ర విత్తనాభివృద్ది సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జిల్లా కలెక్టర్ V.P.గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు.ఎస్ వారియర్, సూడా చైర్మన్ విజయ్ కుమార్ుయ, వివిధ శాఖల అధికారులు, కార్పొరేటర్లు ఉన్నారు..

ఎప్పటికప్పుడు లెటెస్ట్ న్యూస్ చూడాలనుకుంటున్నారా.. బ్రెకింగ్ తెలుసుకోవాలనుకుంటున్నారా.. అయితే👆 మీకు కనిపించే 🛎️ గంటను నొక్కండి.. ఎప్పటికప్పుడు ‘మా న్యూస్ మీ ముంగిట..’

గంటను నొక్కండి.. సబ్ స్రైబ్ చేయండి..ఫ్లీజ్