Telugu News

కుట్టు మిషన్‌లు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

మొత్తం 64 మందికి ఉచిత కుట్టు మిషన్ లు, ధృవీకరణ పత్రలు అందజేత.

0

కుట్టు మిషన్‌లు పంపిణీ చేసిన మంత్రి పువ్వాడ.

== ఉచిత ట్రైనింగ్ ఇచ్చిన సత్య మార్గం సర్వీసెస్ సొసైటీ, మిషన్లు వితరణ చేసిన ఆర్జేసీని అభినందించిన మంత్రి పువ్వాడ.

== మొత్తం 64 మందికి ఉచిత కుట్టు మిషన్ లు, ధృవీకరణ పత్రలు అందజేత.

(ఖమ్మంప్రతినిధి-విజయంన్యూస్)

మహిళలు ఆర్థికంగా ఎదిగినప్పుడే మహిళా సాధికారత సాధ్యమవుతుందని, అందుకు మనం వారికి చేయూతనివ్వాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. సోమవారం ఖమ్మం నగరం 46వ డివిజన్ ఆర్జేసీ కృష్ణ నివాసంలో ఎర్పాటు చేసిన సమావేశంలో కుట్టు మిషన్ లో శిక్షణ పొందిన 64 మందికి ఆర్జేసీ క్రిష్ణ వితరణ చేసిన ఆయా మిషన్ లను మంత్రి పువ్వాడ చేతుల మీదగా అందజేశారు. సత్య మార్గం సర్వీసెస్ సొసైటీ ద్వారా స్వయం ఉపాధి టైలరింగ్‌లో శిక్షణ పొందిన అభ్యర్థులకు కృష్ణ సమకూర్చిన కుట్టు మిషన్‌, ధృవీకరణ పత్రాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ మాట్లాడుతూ.. ఇంట్లోనే మహిళలకు ఉపాధి కల్పించేలా ప్రభుత్వంతో పాటు మన వంతు కూడా కృషి చేయాలన్నారు. ఇంట్లోనే ఉంటూ కుట్టు మిషన్ ద్వారా మహిళలు ఆదాయం ఆర్జించే విధంగా మహిళలు పని చేయాలన్నారు. దీంతో ఆర్థిక స్వావలంబన సాధ్యమవుతుందన్నారు. కార్యక్రమంలో మయార్ పునుకొల్లు నీరజ, సుడా ఛైర్మన్ విజయ్ కుమార్, ఏఎంసీ చైర్మన్ శ్వేత, కార్పొరేటర్ కన్నం వైష్ణవి ప్రసన్న కృష్ణ, రుద్రగాని ఉపేందర్ తదితరులు ఉన్నారు.

ఇదికూడా చదవండి: ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తా: మంత్రి పువ్వాడ