Telugu News

ఈ నెల 10న తహసీల్దార్, పోలీస్ స్టేషన్ ప్రారంభం

Minister Puvvada gave good news to the farmers

0
ఈ నెల 10న తహసీల్దార్, పోలీస్ స్టేషన్ ప్రారంభం
== త్వరగా పనులు పూర్తి చేయండి

== భవన నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కలెక్టర్

ఖమ్మం, జూన్ 3(విజయంన్యూస్): 

రఘునాధపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ నిర్మాణ పనులను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో కలిసి శనివారం పరిశీలించారు. రూ.50 లక్షలతో పోలీస్ స్టేషన్ , రూ.50 లక్షలతో నిర్మిస్తున్న తహశీల్దార్ కార్యాలయాల నిర్మాణ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు ఆయన అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సంబరాలు జరుకునే విధంగా 10వ తేదీన జరుపతలపెట్టిన సుపరిపాలన దినోత్సవంలోగా నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రారంభించుకుని ఇక్కడి నుండే సేవలు అందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన పలు సూచనలు చేశారు. ఆయా సేవలు పొందడానికి వచ్చే ప్రజలకు ఏలాంటి ఇబ్బందులు కలుగకుండా, చెట్లు, టాయిలెట్స్, త్రాగు నీరు, పార్కింగ్, వేచిఉండే గదిలో ఫ్యాన్స్ ఇతర సదుపాయాలను ఏర్పాటు చేయాలని అన్నారు.
allso read- రైతులకు శుభవార్త చెప్పిన మంత్రి పువ్వాడ
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, ఏసీపీ రామోజీ రమేష్, పీఆర్ డిఇ శ్రీనివాసరావు, తహశీల్దార్ నర్సింహారావు, జడ్పీటిసి ప్రియాంక, ఏఇ ఆదిత్య రాజ్, అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.